English | Telugu

సరైన సమయంలో సరైన పావులు కదిపిన చాణక్యుడు.. బిగ్ బాస్ చరిత్రలో నిలిచిపోతుంది!

బిగ్ బాస్ సీజన్-7 టైటిల్ కప్ కి మరికొన్ని రోజులే ఉండటంతో మరింత ఆసక్తికరంగా మారింది. హౌస్ లో ప్రస్తుతం ఆరుగురు కంటెస్టెంట్స్ ఉండగా వారి జర్నీ వీడియోలతో సర్ ప్రైజ్ చేస్తున్నాడు బిగ్ బాస్. రోజుకి ఇద్దరి జర్నీ వీడియోలతో ప్రేక్షకులకు మళ్లీ కంటెస్టెంట్ ఆటతీరు, మాటతీరుని చూపిస్తున్నాడు. మొన్న అమర్, అర్జున్ ల జర్నీ చూపించగా.. నిన్న శివాజీ, ప్రియాంకల జర్నీ చూపించాడు బిగ్ బాస్.

నిన్నటి ఎపిసోడ్ లో మొదట శివాజీని గార్డెన్ ఏరియాకి పిలిచాడు బిగ్ బాస్. అక్కడ తను హౌస్ లోకి వచ్చినప్పటి నుండి ఇప్పటివరకు జరిగిన జ్ఞాపకాలని గుర్తుచేస్తూ తీసిన ఫోటోలని చూసి మురిసిపోయాడు. ఇక ఆ తర్వాత యాక్టివిటి ఏరియాకి పిలిచి తన జర్నీ వీడియో చూపించాడు బిగ్ బాస్. ఇక ఈ జర్నీ చూస్తూ.. నా ఇరవై సంవత్సరాల సినిమా కెరీర్ ఒక ఎత్తు, లైఫ్ లో బిగ్ బాస్ ఒక ఎత్తు అని శివాజీ చెప్పాడు. శివాజీ.. మిమ్మల్ని ఒక వేలెత్తి చూపిస్తే మిగతా నాలుగు వేళ్ళు వాళ్ళ వైపే ఉండేలా చేయగల మాటకారి మీరు అని బిగ్ బాస్ చెప్తూ.. రాజుగారి పెద్ద పెళ్ళాం మంచిదంటే చిన్నపెళ్ళాం చెడ్డదని కాదని శివాజీ చెప్పిన మాటలని ప్లే చేసి చూపించాడు బిగ్ బాస్. మీ గాయం మిమ్మల్ని ఎంత వేధించిన ఓటమి వైపు చూడలేదు. మీ అబ్బాయి డాక్టర్ గా వచ్చినప్పుడు మీ బాధనంతా మర్చిపోయారని బిగ్ బాస్ చెప్తుండగా శివాజీ ఎమోషనల్ అయ్యాడు. సరైన సమయంలో సరైన పావులు కదిపి చాణక్యుడులా నిలిచాడని టాస్క్ లో శోభాశెట్టితో శివాజీ డిఫెండ్ చేసిన వీడియోని ప్లే చేశాడు బిగ్ బాస్. ఈ పూర్తి సీజన్ లో మీ మీద పైచేయి సాధించిన ఒకే ఒక విషయం ఏంటో తెలుసా.. కాఫీ. అలా చెప్పి శివాజీ కాఫీ కోసం పడే ఆవేదనని కళ్ళకి కట్టినట్టు చూపించాడు. కంటెస్టెంట్ గా మొదలై కన్ఫమేషన్ పొంది హౌస్ మేట్ అయ్యారు. మీ ఆటతీరే మిమ్మల్ని ఈ రోజు ఈ స్థానంలో నిలబెట్టిందని బిగ్ బాస్ చెప్పగా.. థాంక్స్ బిగ్ బాస్ అని శివాజీ చెప్పాడు.

పంజా సినిమాలోని " నీ చిరు చిరు చూపులే పంజా" పాటని ఏవీ చివరలో ప్లే చేసాడు. ఇది పవర్ ఫుల్ జర్నీగా బిగ్ బాస్ చరిత్రలో నిలిచిపోతుంది. శివాజీ బిగ్ బాస్ టైటిల్ విజేత అని దీన్ని బట్టే తెలుస్తుంది. బిగ్ బాస్ హౌస్ లో ఇప్పటికే శివాజీ తన ఫెయిర్ గేమ్ తో ప్రేక్షకుల మనసు గెలుచుకున్నాడు. హౌస్ లో ఏదైన టాస్క్ తర్వాత శివాజీ పక్కన ఎవరైన హౌస్ మేట్ ఉంటే.. వారిద్దరిలో ఏకాభిప్రాయంతో ఒకరిని సెలెక్ట్ చేయండి అని బిగ్ బాస్ చెప్తే.. మిగిలిన అందరు కలిసి శివాజీకే ఓట్ వేస్తారనేది అందరికి తెలిసిన నిజం. ఎందుకంటే శివాజీలో ఆటలో ఫౌల్, మాటల్లో నెగెటివ్ అంటు ఏమీ ఉండవు. అందుకే అతడిని శివాజీ.. ది బాస్ అంటు ప్రేక్షకులు కామెంట్లలో తెలుపుతున్నారు.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.