English | Telugu

నిన్ను హీరోయిన్ గా పెట్టి సినిమా తీసే డైరెక్టర్ వస్తాడు!

స్టార్ మా టీవీలో ప్రతీ శని, ఆదివారాల్లో ప్రసారమవుతున్న డ్యాన్స్ షో 'బిబి జోడి'. ఈ షోకి తరుణ్ మాస్టర్, సదా, రాధ జడ్డ్ లు గా వ్యవహరిస్తుండగా శ్రీముఖి యాంకర్ గా చేస్తుంది. అయితే గత ఆదివారం సెమీఫైనల్‌ ముగిసింది. ఆ సెమీఫైనల్‌లో అఖిల్- తేజస్విని జోడి ఎలిమినేట్ అయి మిగిలిన ఐదు జోడీలు ఫినాలేకు చేరుకున్నాయి.

తాజాగా విడుదలైన బిబి జోడీ ప్రోమోలో అన్ని జోడీలు వారి ప్రతిభనంతా, కష్టాన్నంత పోగు చేసుకొని డ్యాన్స్ చేసినట్టుగా తెలుస్తుంది. అన్నీ జోడీలు సాలిడ్ పర్ఫామెన్స్ ని ఇచ్చినట్టుగా, అన్నీ పవర్ ప్యాక్ పర్ఫామెన్స్ ల్లా అనిపిస్తున్నాయి. ఈ జోడీల పర్ఫామెన్స్ చూసాక జడ్జెస్ కి కూడా విజేత ఎవరో చెప్పడం కష్టమే అవుతుంది. అయితే ఈ షో కి చీఫ్ గెస్ట్ గా శేఖర్ మాస్టర్ రావడంతో 'పూనకాలు లోడింగ్' అన్నట్టుగా కంటెస్టెంట్స్ తమ డ్యాన్స్ తో ఇరగదీసారు.

అన్ని జోడీలు బాగా పర్ఫామ్ చేశాయి. అయితే సూర్య-ఫైమా జోడి చేసిన డ్యాన్స్ పర్ఫామెన్స్ చూసి, శేఖర్ మాస్టర్ స్టేజ్ మీదకి వచ్చాడు. "మీ పర్ఫామెన్స్ చూస్తున్నంతసేపు నాకు గూస్ బంప్స్ వచ్చాయి. మార్క్ మై వర్డ్స్.. ఏదో ఒకరోజు నిన్ను హీరోయిన్ గా పెట్టి సినిమా తీసే డైరెక్టర్ వస్తాడు" అని శేఖర్ మాస్టర్ చెప్పేసరికి.. షో మొత్తం చప్పట్లు, అరుపులు, విజిల్స్, కేకలతో స్టేజ్ దద్దరిల్లింది. తాజాగా విడుదలైన ఈ ప్రోమోకి మంచి వ్యూస్ వస్తున్నాయి. మరి ఈ షో టైటిల్ విజేత ఎవరో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే!

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.