English | Telugu

తను చస్తే ఆ పద్నాలుగు మంది రావాలంట!

బిగ్ బాస్ సీజన్-7 రోజురోజుకి ఆసక్తికరంగా సాగుతుంది. ఇప్పటికే హౌజ్ లో ఉన్న కంటెస్టెంట్స్ లో ఎవరేంటని బిగ్ బాస్ ప్రేక్షకులకు అర్థమైంది. అయితే ఈ వారం ఒక్కొక్కరికి హోస్ట్ నాగార్జున చాలా గట్టిగానే క్లాస్ పీకాడు. అమర్ దీప్ కంటెస్టెంట్స్ ని రారా, పోరా, వినురా అంటూ మర్యాద లేకుండా మాట్లాడటాన్ని ఇప్పటికే ప్రేక్షకులు తీసుకులేకపోతున్నారు. దాని గురించి నాగార్జున ‌మాట్లాడకపోవడం అనుమానాలకు దారితీస్తుంది.

సీజన్-7 మొదలైందే ఉల్టా పల్టా థీమ్ తో.. అంటే సాధారణంగా ప్రతీ సీజన్ లో లాగా ఓటింగ్ లో చివరన ఉండేవాళ్ళని కాకుండా ఈ సారి ఉల్టా పల్టా చేసి.. టాప్ లో ఉండేవారిని ఎలిమినేట్ చేస్తారేమో అని అనుకున్నారంతా, కానీ ఓటింగ్ ప్రకారం టాప్ లో పల్లవి ప్రశాంత్ ఉన్నాడు. శివాజీ సెకండ్ స్థానంలో ఉన్నాడు. చివరి స్థానంలో షకీల ఉంది. ఇక రతిక మైండ్ గేమ్ పనిచేయకపోగా, కంటెంట్ కోసం నటిస్తోందని ప్రేక్షకులకు ఇప్పటికే అర్థం అయింది. దాంతో తను అయిదవ స్థానానికి పడిపోయింది. ఇక టేస్టీ తేజ ఉన్నాడా లేదా అనిపిస్తుంది. టేస్టీ తేజ ఎలిమినేట్ అవుతాడని అనుకున్నారంతా కానీ షకీల ఎలిమిమేట్ అయింది.

షకీల ఎలిమినేషన్ జరిగిన తర్వాత బిబి బజ్ ఎగ్జిట్ ఇంటర్వ్యూ గీతు రాయల్ తో జరిగింది. అయితే తాజాగా ఆ ప్రోమో విడుదలైంది. కాగా ఈ ప్రోమోలో షకీల కొన్ని ఆసక్తికరమైన విషయాలని షేర్ చేసింది. మీరు ఆశ్రమానికి వెళ్ళారనుకున్నారా? బిగ్ బాస్ హౌజ్ లోకి వెళ్ళారనుకున్నారా? అని గీతు రాయల్ అడుగగా.. ఎక్స్ క్యూజ్ మి అని షకీల అంది. హౌజ్ లో శివాజీ గారి బ్యాచా? లేక సీరియల్ బ్యాచా? అని గీతు రాయల్ అడుగగా.. నేను చెప్పానా అని షకీలా అంది. నేను అడుగుతున్నాని గీతు రాయల్ అనగా‌‌.. నువ్వెవరు నన్నడిగేదని షకీల అంది. ఒక్కో కంటెస్టెంట్ గురించి చెప్పమని గీతు రాయల్ అడుగగా.. ప్రిన్స్ యావర్ వెదవ, శోభా శెట్టి మాస్క్ వేసుకుంది. శివాజీ బిగ్ బ్రదర్ లాగా ఉన్నాడని షకీల అంది‌. రతికని బ్యూటిఫుల్ స్నేక్ అని, తను ఎవరికి ఐ కాంటాక్ట్ ఇవ్వదని, ఇస్తే దొరికిపోతుందని షకీల అంది. బిగ్ బాస్ హౌజ్ లో షకీల సేఫ్ గేమ్ ఆడుతుందా అని గీతు రాయల్ అడుగగా.. నేను చస్తే ఈ పద్నాలుగు మంది రావాలి. అది నాకు కావాలా అని షకీల అంది. ఇలా ఒక్కో కంటెస్టెంట్ గురించి తన పాయింటాఫ్ లో చెప్పింది షకీల‌.

Brahmamudi: రాహుల్ మనిషిని పట్టుకున్న రాజ్, కావ్య.. ఇక దేత్తడి!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -905 లో....అప్పు పాప కేసు ఫైల్ చూస్తుంటే ఆఫీసర్ వస్తాడు. నీకు ఎన్నిసార్లు చెప్పాను వద్దని అయినా అలాగే చేస్తున్నావని కోప్పడతాడు. లేదు సర్ పాప చనిపోలేదు.. చనిపోయిన పాప వేరు.. ఆ పాప DNA తో మ్యాచ్ అవ్వడం లేదని రిపోర్ట్స్ చూపించగానే అవునా కేసులో ఒక కొత్త మలుపు తీసుకొని వచ్చావ్ గుడ్ కేరియాన్ అని ఆఫీసర్ అంటాడు. కాసేపటికి రేపు పాప వాళ్ళ ఫాదర్ ని స్టేషన్ కి రప్పించండి అని కానిస్టేబుల్ తో అప్పు చెప్తుంది. మరొకవైపు రాహుల్ అవార్డు ఫంక్షన్ కి రాజ్, కావ్య వెళ్తారు. అక్కడ రాహుల్ డిజైన్స్ చూసి రాజ్, కావ్య షాక్ అవుతారు.

Karthika Deepam2: జ్యోత్స్న చేసిన ఫ్రాడ్ చూసి కార్తీక్, శ్రీధర్ షాక్.. ఇంటి వారసురాలు కాదేమో!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -542 లో..... కార్తీక్, శ్రీధర్ జ్యోత్స్న రెస్టారెంట్ ఫుడ్ ట్రక్స్ బాగా పాపులర్ అయ్యాయని హ్యాపీగా ఉంటారు. ఇద్దరు బయట టీ తాగుతూ కబుర్లు చెప్పుకుంటారు. జ్యోత్స్న చాలా తప్పు డు లెక్కలు చూపించిందని శ్రీధర్ అనగానే ఎంత మొన్న కొన్న ల్యాండ్ గురించా అని  కార్తీక్ అడుగుతాడు. లేదు అది జస్ట్ శాంపిల్ మాత్రమే.... ఎంత అంటే అది చెప్తే శివన్నారాయణ గుండె పట్టుకొని పడిపోయేంత డబ్బులు ఫ్రాడ్ చేసిందని శ్రీధర్ అనగానే కార్తీక్ షాక్ అవుతాడు.