English | Telugu

ట్రెండింగ్ లో బిగ్ బాస్ నామినేషన్స్ ప్రోమో.. దామిణి వర్సెస్ యావర్!

బిగ్ బాస్ సీజన్-7 ఇప్పటికే రెండు వారాలు పూర్తి చేసుకుంది. మొదటి వారం కిరణ్ రాథోడ్ ఎలిమినేషన్ అయింది. రెండవ వారం షకీల ఎలిమినేట్ అయింది. ‌కాగా ఇప్పుడు హౌజ్ లో పన్నెండు మంది కంటెస్టెంట్స్ ఉన్నారు. సోమవారం రోజున జరిగే నామినేషన్లకి ఒక క్రేజ్ ఉంటుంది. ఈ ప్రోమో ఇప్పుడు ఫుల్ ట్రెండింగ్ లో ఉంది.

నామినేషన్లు ఒక పొలిటికల్ పార్టీకి మరొక పొలిటికల్ పార్టీకి మధ్య మాటల యుద్ధంలా జరుగుతుంటాయి. కాగా ఈ నామినేషన్లో ప్రియాంక జైన్ కొత్తగా జాయిన్ అయింది. గత రెండు వారాల్లో ఒక్కసారి కూడా నామినేషన్ కానీ శుభశ్రీ రాయగురు, ప్రియాంక జైన్ మూడవ వారం నామినేషన్లో ఉన్నారు‌. ఇక ఆట సందీప్, శివాజీ ఇద్దరు పవరస్త్రని సాధించారు కాబట్టి వారు నామినేషన్లో ఉండరు. మిగిలిన పది మందిలో ఏడుగురు నామినేషన్లో ఉన్నట్లుగా తెలుస్తోంది. యావర్ కి దామిణికి మధ్య మాటల యుద్ధం జరినట్టుగా ఉంది. ఇక శుభశ్రీని అమర్ దీప్ నామినేట్ చేసి.. అసలు ఏనాడైన హౌజ్ లో ఊడ్చావా అంటూ నిలదీశాడు. ఇక అందరు రతికని టార్గెట్ చేసినట్టు తెలుస్తుంది.

ప్రియాంక జైన్, శుభశ్రీ రాయగురు, దామిణి, అమర్ దీప్,‌ ప్రిన్స్ యావర్, టేస్టీ తేజ, గౌతమ్ కృష్ణ, రతిక నామినేషన్లో ఉన్నట్టుగా తాజాగా రిలీజైన ప్రోమోలో తెలుస్తోంది. మరి వీరిలో ఎవరు నామినేట్ అయ్యారు? ఎవరు కాలేదో తెలియాలంటే ఫుల్ ఎపిసోడ్‌ వరకు ఆగాల్సిందే. అయితే ఇప్పటికైతే టేస్టీ తేజ, శోభా శెట్టి, ప్రియాంక జైన్ వీక్ కంటెస్టెంట్ అని తెలుస్తుంది. కాగా ఈ సారి పల్లవి ప్రశాంత్ సేఫ్ లో ఉన్నాడు. అతడిని ఎవరు నామినేట్ చేయలేదని తెలుస్తుంది. అయితే అమర్ దీప్ కి నెగటివ్ కామెంట్స్, ట్రోల్స్ రోజు రోజుకి పెరుగుతున్నాయి. మరి మూడవ వారం బిగ్ బాస్ హౌజ్ లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ కూడా ఉంటుందనే వార్త నెట్టింట చక్కర్లు కొడుతుంది. ఉల్టా పల్టాతో సాగుతున్న ఈ సీజన్ లో మూడవ వారం ఎలా ఉంటుందో చూడాలి మరి!

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.