English | Telugu
మేం కలిసి స్టెప్పులేస్తే మామూలుగా ఉండదు!
Updated : Sep 21, 2022
డాన్స్ అంటే బుల్లితెరపై ముందుగా గుర్తొచ్చేది శేఖర్ మాస్టర్. ఆయన గురించి చెప్పడం కన్నా ఆయన కోరియోగ్రఫీ చేసిన డాన్స్ స్టెప్స్ చూస్తే చాలు ఆయన ఎంత టాలెంటెడ్ పర్సనో అర్థమైపోతుంది. ఆయన ఎప్పుడో తన కూతురు సాహితి, కొడుకు విన్నీని బుల్లితెరకు పరిచయం చేసేసాడు. విన్నీ సిల్వర్ స్క్రీన్ మీద కూడా ఎంట్రీ ఇచ్చేసాడు. ఇక శేఖర్ మాస్టర్ తన పిల్లలకు నచ్చిందే చేస్తూ ఉంటాడు. వాళ్ళ డాన్సులు చూసి ఎంకరేజ్ చేస్తూ ఉంటాడు.
సాహితి, విన్నీ కూడా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఉంటారు. వాళ్ళ డాన్స్ లు ఫుల్ వైరల్ అవుతూ ఉంటాయి. అప్పుడప్పుడు శేఖర్ మాస్టర్ కూడా వాళ్ళతో కలిసి డాన్స్ స్టెప్స్ వేస్తూ ఉంటాడు. ఇక ఇప్పుడు మహేష్ బాబు మూవీ 'సర్కారు వారి పాట' మూవీ నుంచి "కమాన్ కమాన్ కళావతి" సాంగ్ కి పిల్లలతో కలిసి స్టెప్పులు వేశాడు శేఖర్ మాస్టర్. అలా ఈ ముగ్గురు చేసిన ఈ డాన్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
శేఖర్ మాస్టర్ అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చి ఇప్పుడు 'డాన్స్ ఐకాన్' షోలో జడ్జిగా పార్టిసిపేట్ చేస్తున్నారు. అలాగే ఈ షోలో కంటెస్టెంట్స్ తో కలిసి, ఈ షో కో-ఓనర్ శ్రీముఖి తో కలిసి వేసే స్టెప్పులు చూసి మైండ్ బ్లాక్ ఐపోతుంది.