English | Telugu

నేను ఏ మూవీ డైరెక్ట్ చేయడం లేదు..అదంతా ఫేక్ న్యూస్..క్లారిటీ ఇచ్చిన శేఖర్ మాష్టర్

శేఖర్ మాష్టర్ మూవీ డైరెక్ట్ చేస్తున్నాడంటూ త్వరలో అది రిలీజ్ కాబోతోందంటూ రీసెంట్ గా సోషల్ మీడియాలో ఒక న్యూస్ చక్కర్లు కొట్టింది. ఐతే ఇప్పుడు ఆయన ఒక వీడియోని రిలీజ్ చేశారు.."నేను ఒక మూవీని డైరెక్ట్ చేస్తున్నానంటూ ఒక న్యూస్ వస్తోంది. అది ఫేక్ న్యూస్..నేను ఏ మూవీని డైరెక్ట్ చేయలేదు. ఒకవేళ నేను డైరెక్ట్ చేస్తే గనక మీ అందరికీ చెప్తాను. షూటింగ్స్ చేయడానికే టైం సరిపోవట్లేదు.. ఇప్పుడు నాకు డైరెక్ట్ చేసే ఉద్దేశమే లేదు. ఇంకో విషయం ఏమిటి అంటే మా శేఖర్ స్టూడియో నుంచి లాస్ట్ ఇయర్ "టెర్రస్ లవ్ స్టోరీ" వచ్చింది.

అలానే రేపు శివరాత్రి సందర్భంగా "ఇష్టమే..కానీ ప్రేమ లేదంట" అనే వెబ్ సిరీస్ ఫస్ట్ ఎపిసోడ్ మా స్టూడియో నుంచే రాబోతోంది. మీ అందరికి చాలా బాగా నచ్చుతుంది. తప్పకుండా చూడండి" అంటూ ఒక వీడియోని తన ఇన్స్టాగ్రామ్ పేజీలో ప్లేస్ లో ఉన్నాడు. ఒక పక్కన కొరియోగ్రఫీ చేస్తూనే బుల్లితెరపైన షోస్ కి జడ్జిగా వ్యవహహరిస్తున్నాడు. యూట్యూబ్ లో వీడియోస్ అప్ డేట్ చేస్తూ ఫ్యాన్ ఫాలోయింగ్ ని పెంచుకుంటున్నాడు. తన కూతురు, కొడుకుతో కలిసి చేసే ఫన్నీ వీడియోలు బాగా ఎంటర్టైన్ చేస్తుంటాయి. శేఖర్ మాష్టర్ కొడుకు కూడా ఒక మూవీలో నటించి తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నాడు.

టాలీవుడ్ లో పాన్ ఇండియా స్టార్స్ కి శేఖర్ మాష్టర్ కొరియోగ్రఫీ చేస్తుంటాడు. అతని డాన్స్ స్టెప్స్ కూడా సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతుంటాయి.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.