English | Telugu
'ఏ డాన్సర్‌నీ అడగలేదు.. ఒక్కసారి నిన్ను టచ్ చేయొచ్చా!'
Updated : Oct 11, 2022
'డాన్స్ ఐకాన్'దుమ్ము రేపే డాన్సస్ తో ప్రతీ వారం అలరిస్తోంది. ఇక ఈ వారం లేటెస్ట్ ఎపిసోడ్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఈ వారం థీమ్ వచ్చేసి "డాన్స్ విత్ సెలబ్రిటీస్" అని ఓంకార్ అనౌన్స్ చేశారు. ఇక ఇందులో ఒక్కొక్కళ్ళ డాన్స్ నెక్స్ట్ లెవెల్లో ఉంది. ఎవరిదీ ఎక్కువ ఎవరిదీ తక్కువ అని చెప్పడానికే చాలా కష్టంగా అనిపించింది జడ్జెస్ కి. వర్తిక, సౌమ్య స్టన్నింగ్ డాన్స్ పెర్ఫార్మెన్స్ కి జడ్జెస్ ఫుల్ ఫిదా ఇపోయారు. "నేను ఇప్పటివరకు ఏ డాన్సర్ ని అడగలేదు.
ఒకసారి నేను వచ్చి నిన్ను టచ్ చేయొచ్చా అని శేఖర్ మాస్టర్ స్టేజి మీదకు వచ్చి ఆమె చేతుల్ని పట్టుకుని దణ్ణం పెట్టుకొనేసరికి" అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. "ఏం కామెంట్ చేయాలో కూడా అర్ధం కావట్లేదు" అంది రమ్యకృష్ణ. జబర్దస్త్ వర్ష ఈ షోలోకి ఎంట్రీ ఇచ్చి డాన్స్ చేసింది. తర్వాత యష్ మాస్టర్ అతని వైఫ్ తో కలిసి " రా రా రక్కమ్మ" సాంగ్ డాన్స్ చేసాడు. "యష్ చేసిన డాన్స్ స్టెప్ బాగుంది ఇదే స్టెప్ శ్రీముఖితో ఎలా చేస్తాడో చూద్దాం" అని ఓంకార్ అనేసరికి యష్, శ్రీముఖి అదే డాన్స్ కి స్టెప్స్ వేశారు కానీ డాన్స్ స్టైల్ మార్చేసరికి యష్ కి అతని వైఫ్ కి మధ్య గొడవలు పెట్టడానికి శేఖర్ మాస్టర్, ఓంకార్ ట్రై చేసి ఫన్ క్రియేట్ చేశారు.
తర్వాత అమరదీప్-అనుదితతో కలిసి "ఉప్పెన" మూవీలో రొమాంటిక్ సాంగ్ కి డాన్స్ చేసాడు. "ఎంగేజ్మెంట్ చేసుకుని ఇప్పుడు ఇలా అనుదితతో రొమాన్స్ చేస్తున్నాడు అమరదీప్ "అని ఓంకార్ అనేసరికి "చూస్తుంటే అనుదిత-అమరదీప్ నిజమైన లవర్స్ లా అనిపిస్తున్నారు" అంది రమ్యకృష్ణ. ఇక భానుశ్రీ-అసిఫ్ డాన్స్ మెస్మోరైజ్ చేసేసింది. ఇలా రాబోయే వారం షో ఇరగదీసే పెర్ఫార్మెన్సెస్ ఎంటర్టైన్ చేయబోతోంది.