English | Telugu
మొదట్లో నా తెలుగు చూసి నవ్వుకునేవాళ్ళు...ఇప్పుడు నేర్చుకుంటున్న
Updated : Dec 27, 2023
‘ఎన్నెన్నో జన్మలబంధం’ సీరియల్‌తో తెలుగు ఆడియన్స్ అలరించిన దేబ్‌జాని మోదక్ అలియాస్ వేద-యష్ జోడి బుల్లితెర మీద హిట్ పెయిర్ గా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించుకుంది. ఇక ఇప్పుడు ఈ పెయిర్ మళ్ళీ "సత్యభామ" అనే సీరియల్ లో నటిస్తూ ఆడియన్స్ ముందుకు వచ్చేసింది. స్టార్ మా ఛానల్‌లో కొత్తగా ప్రారంభమైన ఈ సీరియల్ సోమవారం నుంచి శుక్రవారం వరకూ రాత్రి 9.30 గంటల స్లాట్ లో ప్రసారమవుతోంది.
‘సాంప్రదాయానికి రౌడీయిజానికి ముడిపడిన బంధం ఈ సత్యభామ అంటూ సరికొత్త ధారావాహికతో ఆడియన్స్ ని ఆకట్టుకుంటోంది ఈ జోడి. వేదగా ఇంతవరకు ఆడియన్స్ ని అలరించిన సొట్టబుగ్గల బెంగాలీ బ్యూటీ దేబ్జానీ మోదక్.. ఇప్పుడు సత్యభామగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది అలాగే ఈ సీరియల్ కి సంబంధించి రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో కూడా ఎన్నో విషయాలు చెప్పింది. ఏ విషయాన్ని ఐనా కుండబద్దలు కొట్టినట్టు చెప్పే పాత్రలో సత్యభామగా నటిస్తూ అలరిస్తోంది. "నేను వేద అంత సాఫ్ట్ పర్సన్ కాదు .. సత్యభామ అంత గడుసరిని కాదు. నేను బెంగాలీ అయినా తెలుగు ఆడియన్స్ బాగా ఆదరిస్తున్నారు. వాళ్ళ కోసమే నేను తెలుగు నేర్చుకుంటున్నాను. మొదట్లో తెలుగు వచ్చేదే కాదు..
‘ఎన్నెన్నో జన్మల బంధం’ సీరియల్ చేసేటప్పుడు.. నా తెలుగు విని అందరూ నవ్వుకునేవాళ్లు. మా డైరెక్టర్ ఏం చెప్పారంటే.. నువ్వు తప్పు మాట్లాడినా పర్లేదు..ప్రాంటింగ్ చేసేటప్పుడు తప్పు చెప్పినా పర్లేదు.. గట్టిగా మాట్లాడమన్నారు. ఆయన చెప్పినట్టే చేశాను..ప్రాంటింగ్ చేసీ చేసీ మెల్లగా తెలుగు వచ్చింది. ఇప్పుడు స్పష్ఠంగా మాట్లాడలేను కానీ.. తెలుగును అర్ధం చేసుకోగలను. ఇక్కడ హీరో హీరోయిన్స్ మేటర్ కాదు..రైటర్, స్టోరీ హీరో హీరోయిన్స్. ఈ సీరియల్‌కి కథే బలం. యష్‌తో కలిసి పనిచేయడం హ్యాపీగా ఉంది. మేం ఆల్రెడీ ఆడియన్స్‌కి కనెక్ట్ అయ్యాం సత్యభామకి పూర్తి అపోజిట్‌గా ఉంటాడు ఈ సీరియల్ హీరో నిరంజన్ " అని చెప్పింది డెబీజాన్...