English | Telugu
Brahmamudi:తన ప్రేమ విషయం బయటపెట్టిన అప్పు.. అక్క గుర్తుపట్టేనా?
Updated : Dec 27, 2023
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -290 లో.. కళ్యాణ్-అనామికల పెళ్లి సందడిలో భాగంగా ఆడపడుచులకి అన్న, తమ్ముళ్ళు గాజులు పెట్టి ఆశీర్వదించాలని ఇంటిపెద్ద అయినటువంటి ఇందిరాదేవీ చెప్తుంది. అరవింద అక్క, మాకు అక్క, చెల్లెలు అంటు ఎవరు లేరు.. ఇన్ని రోజులాగా నువ్వు దూరంగా ఉన్నావ్ ఇక నుండి ఆర్య, విక్కీలతో పాటు నేను, కళ్యాణ్ కూడా నీకు తమ్ముళ్ళమని రాజ్ అనగానే.. అరవింద చాలా హ్యాపీగా ఫీల్ అయి వాళ్లతో గాజులు పెట్టించుకుంటుంది. కాసేపటికి వాళ్ళు అరవిందని ఆశీర్వదిస్తారు.
కావ్య, స్వప్న ఇద్దరు అరవింద భర్తతో.. మాకు నువ్వే అన్నయ్య మాకు గాజులు పెట్టమని చెప్తారు. ఇక ఆ మాటకి ఎమోషనల్ అయిన అతను వాళ్లకి గాజులు పెట్టి ఆశీర్వదిస్తాడు. అప్పుడే నీకు ఇంకొక చెల్లి ఉందని పద్మావతిని చూపిస్తుంది కావ్య. పద్మావతి కూడా నీ చెల్లి కదా.. తనకి కూడా గాజులు పెట్టమని కావ్య అంటుంది. కానీ పద్మావతిని అతను చెల్లి అన్న దృష్టితో చూడడం లేదు కాబట్టి గాజు చేతికి గుచ్చకునేలా చేసి తప్పించుకుంటాడు. మరొకవైపు కళ్యాణ్ ని అప్పు ప్రేమిస్తున్న విషయం చెప్పడానికి బంతి కళ్యాణ్ దగ్గరకి వస్తాడు కానీ అంతలోనే అప్పు వచ్చి బంతిని నిజం చెప్పకుండా ఆపుతుంది. ఆ తర్వాత బంతిని పక్కకి తీసుకెళ్ళి.. నువ్వు ఏమి చేస్తున్నావో తెలుస్తుందా అని బంతిని కొడుతుంది అప్పు. బంతిని కొట్టడం కావ్య చూసి ఏమైందని అడుగుతుంది. మాకు ఎప్పుడు ఉండేదే అక్క అని చెప్పి కవర్ చేస్తుంది అప్పు.
కాసేపటికి ఇరు కుటుంబాలు ఒక దగ్గర కూర్చొని మాట్లాడుకుంటారు. మీకు పెళ్లి తర్వాత జీవితం ఎలా ఉందో కాబోయ్ జంట అయిన అనామిక-కళ్యాణ్ లకు సలహాలు సూచనలు ఏవైనా ఇవ్వండి అని ఇందిరాదేవి చెప్తుంది. ప్రతి ఒక్కరు పెళ్లిపై తమ అభిప్రాయాన్ని భార్య అంటే ఏంటి భర్త అంటే ఏంటి అని వాళ్ళ అనుభవాలని చెప్తారు. కళ్యాణ్ నీకు బెస్ట్ ఫ్రెండ్ కదా.. తనకి నువ్వు ఇచ్చే సలహా ఏంటని అప్పుని ఇందిరాదేవి అడుగుతుంది. అప్పుడే కళ్యాణ్ పై అప్పుకి ఉన్న ప్రేమని బయటపెడుతుంది కానీ అది ఎవరికి అర్థం కాదు. ఒక పద్మావతికి మాత్రం అర్థం అవుతుంది. అప్పు ఎవరినో ప్రేమిస్తుందని పద్మావతి అనుకుంటుంది.. అ తర్వాత అప్పుని కూడా నువ్వు ఎవరినైన ప్రేమిస్తున్నావా అని అడిగితే అదేం లేదని చెప్పి వెళ్లిపోతుంది. కాసేపటి తర్వాత కావ్య, రాజ్, విక్కీ, పద్మావతి అందరు కూర్చొని స్నాక్స్ తింటుంటారు. అప్పుడు కూడా పద్మావతి అప్పు ఎవరినో ప్రేమిస్తుందని అంటుంది. కానీ కావ్య మాత్రం అప్పులో అలాంటి యాంగిల్ లేదని చెప్తుంది. అ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.