English | Telugu

జీ తెలుగులో సంక్రాంతి సంబరాలు... రెండు రోజులు పండగే పండగ!

ఈ కొత్త ఏడాదిలో బుల్లితెర ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేయడానికి జీ తెలుగు రెడీ ఐపోయింది. సంక్రాంతి సంబరాలని రెండు భాగాలుగా ప్రసారం చేయబోతోంది. జనవరి 14 వ తేదీ ఉదయం 9 గంటలకు మొదటి భాగం 15 సాయంత్రం 6 గంటలకు రెండో భాగం రాబోతోంది. ఇందులో టీవీ స్టార్స్‌తో పాటు ఎనర్జిటిక్‌ యాంకర్స్ రవి, శ్యామల తమ మాటలతో అందరినీ అలరించారు.

అంతే కాదు పల్లెటూరి వాతావరణంలో గేమ్ షోస్ కూడా నిర్వహించారు. సంక్రాంతి సంబరాల్లో భాగంగా టీవీ స్టార్స్‌ని రెండు బృందాలుగా విభజించారు. ఈ రెండు టీమ్‌లకు హరిత, అన్నపూర్ణమ్మ లీడర్లుగా వ్యవహరించారు. ఈ రెండు టీమ్‌ల మధ్య డ్యాన్స్‌ పెర్ఫార్మెన్సులు, ఆటలు, కుండ పగులగొట్టడం అబ్బా అద్దిరిపోయే ఆటలు ఆడి అందరినీ ఎంటర్టైన్ చేశారు. ఇక సంక్రాంతి స్పెషల్ ఫుడ్ తిని అందరూ ఎంజాయ్ చేశారు. ఇక రెండో భాగంలో "సీతారామం" మూవీ ఫేమ్‌ మృణాల్ ఠాకూర్ వచ్చారు. దీప్తి, గోకుల్… సీతారామం సాంగ్ ని స్పూఫ్ గా చేసి చూపించారు. ఇక మృణాల్ ఠాకూర్ పిల్లలతో కలిసి ఫుల్ ఎంజాయ్ చేశారు. ఇక ఈ షోకి కొంత మంది ఫారెనర్స్ ని కూడా పట్టుకొచ్చారు. వాళ్లకు కూడా పంచెలు కట్టి తెలుగులో మాట్లాడించారు. వాళ్ళతో కలిసి డాన్సులు కూడా వేశారు. "జీ సంక్రాంతి..తగ్గేదేలే" అని పుష్ప రేంజ్ లో డైలాగ్ చెప్పించారు.

బుల్లితెర నటులు కబడ్డీ ఆడుతుంటే ఆ గేమ్ ని ఎలా ఆడాలి అనే విషయం మీద కొన్ని టిప్స్ ని పోసాని కృష్ణమురళి చెప్పారు. మరోవైపు ఆన్‌స్క్రీన్ జంటలు వాళ్ళ లవ్ ని ఎక్సప్రెస్ చేసుకున్నారు. ఈ షో అంతా ఆటపాటలతో యాంకర్ ప్రదీప్ హోస్టింగ్ తో మరో లెవల్‌కు తీసుకువెళ్తుంది. ఇంకా డీజే టిల్లు ఫేమ్‌ నేహా శెట్టి కూడా స్టేజి మీదకు ఎంట్రీ ఇచ్చి అలరించింది. జీ తెలుగు సంక్రాంతి సంబరాలు ప్రేక్షకులకు సరికొత్త ఆనందాన్ని అందించబోతోంది.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.