English | Telugu

దేవుడి ఫోన్ హ్యాక్... ఫ్రస్ట్రేషన్ లో సాయికిరణ్!

"అనగనగా ఆకాశం ఉంది" సాంగ్ తో ఎంతో పాపులరయ్యారు సాయికిరణ్. సింగర్ గా, యాక్టర్ గా రాణిస్తున్నారు..బుల్లితెర మీద ఎన్నో సీరియల్స్ లో నటిస్తన్నారు కూడా. అలాగే సోషల్ మీడియాలో సాయి కిరణ్ చేసే హడావిడి అంతా ఇంతా కాదు. సరదాగా ఉంటాడు ఎప్పుడూ. తన ఇన్స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేసే రీల్స్ భలే ఫన్నీగా ఉంటాయి. రీసెంట్ గా అలాంటి ఒక ఫన్నీ రీల్ ని దేవుడి గురించే చెప్తూ పోస్ట్ చేసాడు. "ఓ ప్రియమైన దేవుడా...మీకొక సోషల్ మీడియా అకౌంట్ ఉంటే ఈ మెసేజ్ దయచేసి చూడండి..ప్లీజ్...నేను ఎప్పుడైనా లైఫ్ లో ఇంతకన్నా పెద్ద కష్టం ఏమొస్తుందిలే అన్నీ చూసేసాం అని అన్నానే అనుకోండి అది ఛాలెంజింగ్ గా తీసుకోవద్దు. ఎందుకంటే నేను మిమ్మల్ని ఛాలెంజ్ చేయడం లేదు. అదేదో ఫ్రస్ట్రేషన్ లో తెలీక బుద్ది గడ్డి తిని అన్నాను...ఎందుకు నా మాటల్ని ఛాలెంజ్ గా తీసేసుకుని స్ట్రెస్ లెవెల్స్ ఎందుకు పెంచేసుకుంటారు ...ప్లీజ్ నేను అలా అన్న మాటల్ని సీరియస్ గా తీసుకోవద్దు ... ఓకే నా సారీ" అన్నాడు సాయి కిరణ్.

దేవుడికి సోషల్ అకౌంట్ ఉందా అని సాయికిరణ్ అడిగేసరికి నెటిజన్స్ కూడా ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు.."సర్ ముందు దేవుడికి మంచి ఆపిల్ ఫోన్ కొనివ్వండి అంటే ఇంకో నెటిజన ఒక వేళ దేవుడు గనక సోషల్ మీడియా అకౌంట్ ఓపెన్ చేస్తేనా రెండు రోజుల్లో ఆయన ఫోన్ హ్యాక్ అవుతుంది స్టోరేజ్ ఫుల్ ఐపోతుంది. దేవుడికి సోషల్ మీడియా అకౌంటా..ఇదేదో బాగుందే..అడిగి మరీ ట్యాగ్ చేయొచ్చు. దేవుడికి సోషల్ మీడియా అకౌంట్ ఉంటే గుడికి వెళ్లడం మానేసి ఫ్రెండ్ రిక్వెస్ట్ పెడితే సరిపోతుంది." అంటూ కామెడీ కామెంట్స్ ని పోస్ట్ చేస్తున్నారు.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.