English | Telugu

ఆ రోజు గుండె ఆగి సచ్చిపోతావ్.. గీతూ రాయల్‌కి ట్రీట్మెంట్ అయిపోయింది!

గీతూ రాయల్ సోషల్ మీడియాలో జ్ఞానం ప్రసాదిస్తూ ఉంటుంది అదేనండి మోటివేషనల్ వీడియోస్ చేస్తూ జనాలని మేల్కొల్పుతూ ఉంటుంది. ఇప్పుడు కూడా అలాగే ఒక మోటివేషనల్ వీడియోని పోస్ట్ చేసింది అది కూడా "నిజాయితి" అనే టాపిక్ మీద.."సరదాగా ఇంటర్నెట్ లో లేని ఒక మోటివేషన్ చెప్పనా...ఎప్పుడూ నువ్వు నిజాయితీగా ఉండొద్దు. ఎందుకంటే ఈ జెనెరేషన్ లో మీ లాయల్టీని, మీ ప్రేమను, మీ ఇంపార్టెన్స్ ని, మీ ఎమోషన్స్ ని అర్ధం చేసుకుని మెచ్చుకుని మీకు వేల్యూ ఇచ్చే వాళ్ళు ఎవరూ లేరు. నువ్వు నిజాయితీగా ఉన్నా కూడా అవతలి వాళ్ళు ప్రేమను ప్రసాదం పంచినట్టు పంచుతూ ఉంటారు. అది తెలిసిన రోజు గుండె ఆగి సచ్చిపోతావ్ ..నీ సంతోషాన్ని వేరే వాళ్ళ చేతుల్లో పెట్టకు...పాతాళానికి దిగజారిపోతావ్" అని చెప్పింది.

ఇక అమ్మడు చెప్పిన ఈ మోటివేషనల్ వీడియోని చూసిన నెటిజన్స్ "ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉండొచ్చేమో..కానీ మంచి వాళ్ళు కూడా ఉన్నారు..రైట్ పర్సన్స్ ని వెతుకు అని అంటే ..ఇంకొంతమందేమో ఒక రిలేషన్‌షిప్‌లో లాయల్టీ అనేది ఒకరి మధ్య పరస్పర అవగాహన, ప్రేమ, శ్రద్ధ బాధ్యత ఉన్నప్పుడు..సందర్భాన్ని బట్టి రాజీ పడడం..త్యాగాలు చేసుకోవడం వంటివి ఇద్దరి మధ్య బలమైన బంధాన్ని కలిగిస్తుంది." అని మోటివేట్ చేస్తున్నారు. సమాజంలో మంచి వాళ్ళు, చెడ్డవాళ్ళు అంటూ ఎవరూ ఉండరూ.. సందర్భానికి తగ్గట్టు ప్రవర్తించేవాళ్ళు ఉన్నారు. గీతూ రాయల్ ఈ మధ్యనే ఆరోగ్యం సరి లేక హాస్పిటల్ లో చేరింది. తర్వాత ఆమె కొంత ట్రీట్మెంట్ అదీ చేయించుకున్నాక ఇక ఇప్పుడు సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా కనిపిస్తోంది.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.