English | Telugu

త్వరలో 'సరిగమప' ఛాంపియన్ షిప్ న్యూ సీజన్!


'స రి గ మ ప తెలుగు' బుల్లితెర మీద ఎంతగా ఫేమస్ అయ్యిందో అందరికీ తెలిసిన విషయమే. ఇక త్వరలో సరికొత్త సీజన్ తో మళ్ళీ మన ముందుకు రాబోతోంది. ఈ కొత్త సీజన్ కి 'స రి గ మ ప ఛాంపియన్‌షిప్' అని పేరు పెట్టారు. ఈ షోకి సంబంధించిన థీమ్ సాంగ్ ని రిలీజ్ చేశారు మేకర్స్. కొత్త సీజన్ జనవరి నెలాఖరు నుంచి ప్రసారం అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ షోని ప్ర‌దీప్ మాచిరాజు హోస్ట్ చేయ‌నున్నారు.

ఇక జడ్జెస్ గా అనంత శ్రీరామ్, ఎస్పీ శైలజ, మనో ఈ ఛాంపియన్ షిప్ సీజన్ లో కనిపించబోతున్నారు. "ప్రతిభకు జయాపజయాలతో పని లేదు. ఓటమి గమనాన్ని ఆపలేదు. విజయం గమ్యం కాదు...సంగీతం ఒక మహా సముద్రం..సంగీత సాగరంలో సరిగమల మధ్య సమరం మళ్ళీ ఆరంభం" అనే ఇంట్రోతో ఈ షో ప్రోమో రిలీజ్ అయ్యింది. ఈ పేరులోనే తెలిసిపోతోంది ..ఈ సీజన్ స్పెషలిటీ ఏమిటి అనేది. మధురమైన స్వరాలతో, ఆహ్లాదకరమైన గానాలతో, మైమరపించే పాటలతో చివరి 4 సీజన్స్ లో గెలిచిన విన్నర్స్ మధ్య సరిగమల సమరంతో మీ ముందుకి వచ్చేస్తుంది సరిగమప ఛాంపియన్ షిప్.

ఇక ఈ షోలో మెంటార్స్ గా శ్రీకృష్ణ, సాకేత్ కొమండూరి, రమ్య బెహరా, అరుణ్ కౌండిన్య కనిపించబోతున్నారు.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.