English | Telugu
ఇప్పటివరకు ఒక్కసారి కూడా ఐ లవ్ యు చెప్పలేదు
Updated : Sep 15, 2022
ఎక్స్ట్రా జబర్దస్త్ కొత్త కొత్త స్కిట్స్ తో అలరించడానికి సిద్దమయ్యింది. ఇక ఇప్పుడు న్యూ ఎపిసోడ్ ప్రోమో రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. ఇంద్రజ, ఖుష్బూ జడ్జ్ లుగా వ్యవహరిస్తూ వాళ్ళ వాళ్ళ స్టైల్ లో పంచ్‌లు వేస్తూ , నవ్విస్తూ షోని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. వీళ్ళ గ్లామర్ సెట్ లో అదనపు ఆకర్షణగా నిలుస్తోంది. చాలా మంది లవ్ స్టోరీలను ఇలాంటి ఎన్నో షోస్ లో విన్నాం. ఇక ఇప్పుడు ఖుష్బూ వంతు వచ్చింది. ఆమె తన క్యూట్ లవ్ స్టోరీని ఎక్స్ట్రా జబర్దస్త్ స్టేజి పై రివీల్ చేసేసింది. రాకేష్, సుజాత స్కిట్ అయ్యాక " మీరిద్దరిదీ లవ్ మ్యారేజా మేడం " అని ఖుష్బూని అడిగాడు రాకేష్. "టోటల్" అని ఆన్సర్ ఇచ్చింది.." మీ లవ్ స్టోరీ చెప్పండి మేడం" అని ఖుష్బూని అడిగాడు రాకేష్. డైరెక్టర్, యాక్టర్ సుందర్ సి. ఖుష్బూ భర్త అనే విషయం మనందరికీ తెలుసు . "ఆయన డైరెక్టర్ గా తమిళంలో `మురై మామన్` అనే తన ఫస్ట్ ఫిలిం షూటింగ్ టైంలో వచ్చి ప్రొపోజ్ చేశారు.
పెళ్ళై 28 ఏళ్ళు అయ్యింది కానీ ఇప్పటి వరకు ఐ లవ్ యు కూడా చెప్పలేదు తెలుసా" అనేసరికి "సరదాగా ఇప్పుడొకసారి ఫోన్ చేసి ట్రై చేయండి మేడమ్" అని రాకేష్ అనడంతో షూటింగ్ సెట్ లోంచే భర్తకు ఫోన్ చేసింది ఖుష్బూ. "సెల్ లో ఏ పేరు రాసుకున్నారు మేడం" అని మళ్ళీ అడిగేసరికి "స్వీట్ హార్ట్" అని ఆ కాలర్ ఐడిని అందరికీ చూపిస్తుంది. ఆ మాటకు సెట్ మొత్తం హోరెత్తిపోయేలా అరుస్తూ ఉంటారు. ఖుష్భూ కూడా అందంగా సిగ్గు పడుతూ ఉంటుంది. ఇంతలో ఫోన్ చేసి హలో అంది ఖుష్బూ . అటు నుంచి ఆన్సర్ ఏమొచ్చింది ? సుందర్ ఫోన్ లిఫ్ట్ చేశాడా ? లవ్ ప్రొపోజ్ చేసుకున్నారా లేదా ? అనే విషయం తెలియాలంటే ఈ షో కోసం కొంత టైం వెయిట్ చేయాల్సిందే.