English | Telugu

అదే వేరేవాళ్ళు అయి ఉంటే చెప్పుతో కొట్టేదాన్ని : రోహిణి!


సేవ్ ది టైగర్స్ సిరీస్ లో రోహిణి, అభినవ్ గోమఠం కాంబినేషన్ లో వచ్చే కామెడీ ఎంత ఫేమస్ అయిందో అందరికి తెలిసిందే. అయితే రోహిణి ప్రస్తుతం ఈటీవీలోని జబర్దస్త్ లోను నవ్విస్తుంది. ఆ మధ్య తను ఓ సీరియల్ లో వడదెబ్బ తగిలి పడిపోవడం.. అదంతా ఫుల్ కామెడీ అయిన విషయం తెలిసిందే.

ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీలో మంచి అవకాశాలు దక్కించుకుంటున్న రోహిణికి సొంతంగా ఓ యూట్యూబ్ ఛానెల్ కూడా ఉంది. అందులో రెగ్యులర్ గా వ్లాగ్స్ చేస్తూ ట్రెండింగ్ లో ఉంటోంది‌. అయితే ఈ మధ్య సంచలనంగా మారిన రేవ్ పార్టీ గురించి హేమని పోలీసులు అరెస్ట్ చేయడం. అదంతా వైరల్ అవ్వగా.. ఇప్పుడు అందులో రోహిణి కూడా ఉందని కొందరు పుకార్లు సృష్టించారు. రోహిణి ఉండే అవకాశం ఉందంటూ ఓ సీనియర్ జర్నలిస్ట్ అని చెప్పుకునే వ్యక్తి యూట్యూబ్ చానెల్లో పిచ్చి పిచ్చిగా వాగేశాడని రోహిణి అతని మీద ఫైర్ అయింది.

రేవ్ పార్టీలకు వెళ్లే ఉంటుందని, నిప్పు లేనిదే పొగ రాదు కదా అని తన గురించి ఇష్టమొచ్చినట్టుగా మాట్లాడాడు. తనకు తాగుడు అలవాటు లేదని, ఇలా పూర్తిగా విషయాలు తెలుసుకోకుండా ఇష్టమొచ్చినట్టుగా వాగొద్దని రోహిణి వార్నింగ్ ఇచ్చింది. ఇంకా పర్సనల్ గా కూడా మాట్లాడాడని రోహిణి చెప్పింది. తన సర్జరీ గురించి మాట్లాడాడని, లావుగా ఉందని పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదని అన్నాడంటూ మండి పడింది. లావుగా ఉంటే పెళ్లి చేసుకోవద్దా? లావుగా ఉంటే పెళ్లి కాదా? అసలు మీరేం జర్నలిస్ట్.. పైగా సీనియర్.. పెద్దవారని, సీనియర్ జర్నలిస్ట్ అన్న ఒకే కారణంతో వదిలేస్తున్నానని, అదే వేరే వాళ్లు అయి ఉంటే చెప్పు తీసుకొని కొట్టే దాన్ని అంటూ తీవ్రస్థాయిలో రోహిణి ఆగ్రహం వ్యక్తం చేసింది. మాట్లాడే ముందు కాస్త ఆలోచించి జాగ్రత్తగా మాట్లాడమని రోహిణి వార్నింగ్ ఇచ్చింది. ఇదంతా తన ఇన్ స్టాగ్రామ్ ప్రొఫైల్ లో రోహిణి చెప్పగా నెటిజన్లు తనకి మద్దతుగా నిలుస్తున్నారు. ఇప్పుడు ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.