English | Telugu

Illu illalu pillalu : విశ్వకి చుక్కలు చూపిస్తున్న అమూల్య.. శ్రీవల్లి షాక్!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu Illalu pillalu ). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -391 లో..... సాగర్ కి జాబ్ వచ్చిన విషయం ప్రేమకి నర్మద చెప్తుంది. ప్రేమ తనకి హల్ టికెట్ వచ్చిన విషయం నర్మదకి చెప్తుంది. ఇలా ఇద్దరు ఒకరికొకరు తన హ్యాపీ నెస్ ని షేర్ చేసుకుంటారు. అప్పుడే అమూల్య వాళ్ళకి కన్పిస్తుంది. వెంటనే తన దగ్గరికి ఇద్దరు వెళ్లి మాట్లాడతారు. ఇప్పుడు ఇంట్లో ఎలా ఉంది.. అందరూ బాగున్నారా అని ప్రేమ అడుగుతుంది. రేవతి అత్తయ్య నాతో బాగుంటుందని అమూల్య చెప్తుంది.

అమూల్య లోపలకి రాగానే హేయ్ పని మనిషి వచ్చి టిఫిన్ పెట్టు అని విశ్వ అంటాడు. వేడి వేడి సాంబార్ విశ్వ చేతిపై పోస్తుంది అమూల్య. అది చూసి విశ్వ తనపై కోప్పడుతాడు. అందరూ వస్తారు ఏమైందని అడుగుతారు. చిన్న పిల్లాడిలా మా ఆయన సాంబార్ చేతిపై పోసుకున్నాడని అమూల్య అంటుంది. ఆ తర్వాత విశ్వ, అమూల్య మనం గుడికి వెళదాం అని పెద్దావిడ ఇద్దరికి చెప్తుంది.. మరొక వైపు శ్రీనివాస్ రావు, సాగర్ కి గవర్నమెంట్ జాబ్ వచ్చినందుకు గుడికి వచ్చి తన పేరున అర్చన చేయిస్తాడు. అదే గుడికి రామరాజు కుటుంబం వస్తుంది. విశ్వ, అమూల్య కూడా ఆదే గుడికి వస్తారు.

విశ్వని టైమ్ చూసి ఆడుకుంటుంది అమూల్య. విశ్వ మన పెళ్లి జరిగితే మోకాళ్ళపై నడుస్తానని మొక్కావ్ కదా అని అమూల్య అనగానే నేను ఎక్కడ మొక్కానని విశ్వ అంటాడు. ఒరేయ్ ముందు నువ్వు మోకాళ్ళపై నడువు అని పెద్దావిడ అంటుంది. మరొకవైపు శ్రీవల్లి గుడి చుట్టూ పడుకొని ప్రదక్షిణలు చేస్తుంది. మీరు మొక్కుకోని నాతో ఇలా చేయిస్తున్నారని భాగ్యాన్ని శ్రీవల్లి కోప్పడుతుంది. శ్రీవల్లి, విశ్వ ఇద్దరు ఎదురుపడతారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Podharillu : నారాయణ మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన మేనత్త.. మాధవ ఏం చేయనున్నాడు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు (Podharillu)'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్-47 లో..  కన్నాని కాలేజీకి తీసుకెళ్తుంటాడు మాధవ. అన్నయ్య ఈ రోజు నాకు చాలా హ్యాపీగా ఉంది. చక్రి అన్నయ్య రిసెప్షన్ ని గ్రాంఢ్ గా చేసాం.. ఇన్ని రోజులు మనల్ని అందరు అవమానించారు.. ఎన్నో కష్టాలు పడ్డామని మాధవతో కన్నా అనగానే మాధవ ఏం మాట్లాడలేకపోతాడు. చక్రి అన్నయ్య పెళ్ళి జరిగిపోయింది.. ఆ తర్వాత నీ పెళ్ళి తర్వాత కేశవ అన్న పెళ్ళి..  ఆ తర్వాత నా పెళ్ళి అని కన్నా సిగ్గుపడుతుంటాడు. రేయ్.. ఇప్పుడే ఎందుకు నీకు అవన్నీ వెళ్ళి మంచిగా చదువుకొని ఉద్యోగం చేయమని మాధవ అనగానే సరే అని కన్నా కాలేజీకి వెళ్ళిపోతాడు.