English | Telugu

Karthika Deepam2: జ్యోత్స్న రిపోర్ట్స్ మ్యాచ్ అయ్యానని చెప్పిన డాక్టర్!


స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ కార్తీక దీపం-2 (Karthika Deepam2). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్-590 లో.. కాంచనకి కార్తీక్ కాల్ చేస్తాడు. దీప ఇంటికి వచ్చిందా అని అడుగుతాడు. నీకు చెప్పకుండా దీప ఇంటికి ఎందుకు వస్తుంది. దీప ఎక్కడుందని కాంచన అనగానే.. దీప ఇంటికి వచ్చిందా.. రాలేదా చెప్పమని కార్తీక్ అంటాడు. రాలేదని కాంచన అనగానే సరే నేను తర్వాత కాల్ చేస్తానని కార్తీక్ అంటాడు. అదే సమయంలో డాక్టర్ నుండి కార్తీక్ కి కాల్ వస్తుంది.

కార్తీక్.. మీరు అర్జెంట్ గా హాస్పిటల్ కి రండి..దీప ఇక్కడే ఉంది.. ఎక్కడా వెతుకొద్దు అని డాక్టర్ చెప్పగానే పరుగు పరుగున కార్తీక్ వెళ్తాడు. అక్కడ దీపని చూసి.. హాస్పిటల్ కి వచ్చేముందు నాకు చెప్పాలి కదా.‌ నేను ఎక్కడని వెతకాలని కార్తీక్ అంటాడు. అందుకే కాల్ చేశానని డాక్టర్ చెప్తుంది. అత్తకి ట్యాబ్లెట్లు వాడితే సరిపోతుందని చెప్పాను కదా అని కార్తీక్ అనగానే సరిపోదు బావ అని దీప అంటుంది‌. మనం ఏదో ఒక నిర్ణయం తీసుకొని నిర్ణయించుకోవాలి కదా దీప అని కార్తీక్ అనగానే దీప ఆలోచించుకుంది కార్తీక్ అని డాక్టర్ చెప్తుంది. తను ఒక నిర్ణయం తీసుకుంది.. అది చెప్పడానికే నీకు తెలియకుండా నా దగ్గరికి వచ్చిందని డాక్టర్ అంటుంది. కార్తీక్ షాక్ అవుతాడు. దీప తీసుకున్న నిర్ణయం ఏంటంటే.. తన తల్లి ప్రాణాలు కాపాడటానికి తన బిడ్డ ప్రాణాలు వదులుకోవడానికి దీప సిద్ధపడింది అని డాక్టర్ చెప్పగానే కార్తీక్ షాక్ అవుతాడు. మన బిడ్డని చంపేస్తావా.. కడుపులో ఉండగానే చంపేస్తావా.. శౌర్య వచ్చి చెల్లి ఎప్పుడు వస్తుంది నాన్న అడిగితే నేనేం చెప్పాలి.. నా మనవరాలు ఏదని మా అమ్మ అడిగితే నేనేం చెప్పాలి.. ఆ పసిపాప అడుగులు ఉయ్యాల వరకు రాకుండా కాటికి సాగనంపానమ్మా అని చెప్పనా అని కార్తీక్ ఏడుస్తాడు. ప్లీజ్ బావ.. మా అమ్మని కాపాడు..మా అమ్మ పోతే నాకు మరో అమ్మ పుట్టదు అని కార్తీక్ కాళ్ళు పట్టుకొని దీప బ్రతిమిలాడుతుంది. ఇక ఆపరేషన్ చేయండి అని కార్తీక్ అంటాడు. అంటే మీ అత్త కోసం మీరు సరేనంటున్నారా అని డాక్టర్ షాక్ అవుతూ అడుగుతుంది. మిమ్మల్ని చూస్తుంటే చేతులు ఎత్తి దండం పెట్టాలని ఉంది అని డాక్టర్ చెప్తుంది‌. వెంటనే ఆపరేషన్ కి ఏర్పాట్లు చేయండి అని కార్తీక్ అనగానే సుమిత్ర గారి ఫ్యామిలీకి ఏం చెప్పాలి.. నిజమే చెప్పాలి అని డాక్టర్ అంటుంది.

మీరు చెప్పిన ప్రతీ దానికి నేను ఒకే చెప్పలేను.. నిజం చెప్పడానికి నేను వెళ్తున్నానని సుమిత్ర దగ్గరికి వెళ్తుంది డాక్టర్. ఇక శివన్నారాయణ ఇంటికి డాక్టర్ వెళ్తుంది. అందరిని పిలవండి మీకు ఓ నిజం చెప్పాలి అని డాక్టర్ అంటుంది. దశరథ్ పైన ఉన్నట్టున్నాడు నేను తీసుకొస్తానని పారిజాతం పైకి వెళ్తుంది. రిపోర్ట్స్ గురించి డాక్టర్ కి తెలిసింది. డాక్టర్ ని చంపేస్తానని గన్ తీసుకొని వెళ్తుంది పారిజాతం. ఇక అందరు హాల్లోకి వస్తారు. దీప. కార్తీక్ కూడా అక్కడికి వస్తారు. రిపోర్ట్స్ మ్యాచ్ అయ్యాయని డాక్టర్ చెప్తుంది. దాంతో అందరు షాక్ అవుతారు. దీప మీకు కూతరు లాంటిది. మీతో అలాంటి బంధాన్నే పెంచుకుంది అని డాక్టర్ చెప్తుంది. రిపోర్ట్స్ గురించి తనే ఎక్కువగా ఆలోచించిందని చెప్పడానికే అని డాక్టర్ అనగానే అవును డాక్టర్ తను మా కూతురు లాంటిది అని దశరథ్ అంటాడు. ఆ తర్వాత డాక్టర్ వెళ్ళిపోతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Podharillu : నారాయణ మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన మేనత్త.. మాధవ ఏం చేయనున్నాడు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు (Podharillu)'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్-47 లో..  కన్నాని కాలేజీకి తీసుకెళ్తుంటాడు మాధవ. అన్నయ్య ఈ రోజు నాకు చాలా హ్యాపీగా ఉంది. చక్రి అన్నయ్య రిసెప్షన్ ని గ్రాంఢ్ గా చేసాం.. ఇన్ని రోజులు మనల్ని అందరు అవమానించారు.. ఎన్నో కష్టాలు పడ్డామని మాధవతో కన్నా అనగానే మాధవ ఏం మాట్లాడలేకపోతాడు. చక్రి అన్నయ్య పెళ్ళి జరిగిపోయింది.. ఆ తర్వాత నీ పెళ్ళి తర్వాత కేశవ అన్న పెళ్ళి..  ఆ తర్వాత నా పెళ్ళి అని కన్నా సిగ్గుపడుతుంటాడు. రేయ్.. ఇప్పుడే ఎందుకు నీకు అవన్నీ వెళ్ళి మంచిగా చదువుకొని ఉద్యోగం చేయమని మాధవ అనగానే సరే అని కన్నా కాలేజీకి వెళ్ళిపోతాడు.