English | Telugu

‘న్యూ బిగినింగ్’అంటున్న జబర్దస్త్ రీతూ..సీనియర్ యాక్టర్ సన్ తో ఫొటోస్ వైరల్

రీతూ చౌదరి ఈ మధ్య చాలా కొత్తగా కనిపిస్తోంది. యాంకర్ గా లైఫ్ స్టార్ట్ చేసిన రీతూ జర్నీ అంతా ఓపెన్ బుక్. జబర్దస్త్ లో అప్పుడప్పుడు శ్రీదేవి డ్రామా కంపెనీ రెగ్యులర్ గా కనిపిస్తూ అలరిస్తోంది. ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. షార్ట్ ఫిలిమ్స్, కవర్ సాంగ్స్ చేస్తుంది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే రీతూ చౌదరి రీసెంట్ గా ఇన్ స్టాగ్రామ్ లో పెట్టిన పోస్ట్ చూసి అందరూ షాకవుతున్నారు .

ఇందులో స్విమ్మింగ్ పూల్ పక్కన ఓ అబ్బాయితో ఫొటోలకు ఫోజులిచ్చి ‘న్యూ బిగినింగ్’ అని క్యాప్షన్ ఇచ్చింది. ప్రస్తుతం రీతూ షేర్ చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది. ఇక నెటిజన్స్ ఐతే కంగ్రాట్స్ చెప్తున్నారు. రీతూ పక్కన ఉన్న అబ్బాయి పేరు విజయ్ రాజా. అతను మరెవరో కాదు టాలీవుడ్ సీనియర్ నటుడు , కమెడియన్ శివాజీ రాజా వాళ్ళ అబ్బాయి. ఫార్మ్ స్టే బిజినెస్ లో వీళ్ళు పార్టనర్స్ అన్న విషయం తెలుస్తోంది. "ప్రతి ప్రేమికుడు కోరుకునేది ఒకటే తను లవ్ చేసిన అమ్మాయి హ్యాపీ ఉండాలని అందుకే ఇకనుంచి హ్యాపీగా ఉండు...అనుకున్నది సాధించారు.. " అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

Jayam serial : పారు వేసిన ప్లాన్.. గంగని అపార్థం చేసుకున్న రుద్ర!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -140 లో..... పెళ్లి అయి మొదటిసారి ఇంటికి వచ్చిన అల్లుడు కూతురికి లక్ష్మి మర్యాదలు చేస్తుంది. రుద్రకి వరుస అయ్యోవాళ్ళు ఒక ఆటాడుకుంటారు. నల్లపూసల కార్యక్రమం అయ్యాక శోభనానికి ఏర్పాట్లు చేస్తారు. ఇద్దరికి బంతాట ఆడిపిస్తారు. బిందెలో రింగ్ తీయిస్తారు. ఇద్దరు సరదాగా ఉంటారు. రుద్ర వంక గంగ చూస్తుంటే.. ఏంటి చూస్తున్నావ్ వెళ్లి కింద పడుకోమని రుద్ర అంటాడు. ఆ తర్వాత రుద్ర, గంగ సరదాగా బాక్సింగ్ చేస్తుంటారు. అప్పుడే రుద్ర కాలికి సెల్ఫీ స్టిక్ తగులుతుంది. అది రౌడీ చేత పారు పెట్టిస్తుంది.