English | Telugu

మినిస్టర్ నుండి కాల్.. రిషికి షాక్!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -745 లో.. రిషి, సౌజన్యరావులు ఇద్దరిలో కాలేజీ పర్మిషన్ ముందు ఎవరు తెచ్చుకుంటారో వాళ్ళు ఈ ఛాలెంజ్ లో గెలిచినట్లుగా అనుకుంటారు. తన బాస్ కి "మెడికల్ కాలేజీ పర్మిషన్ మనకే రావాలి.. DBST కి రాకుండా మీరే చూసుకోవాలి" అని సౌజన్య రావు మెసేజ్ చెయ్యగానే.. డోంట్ వర్రీ అని అవతలి నుండి అతని బాస్ మెసేజ్ చేస్తాడు.

పది రోజులు గడిచిపోతాయి. రిషి, వసుధార, జగతి, మహేంద్రలు అందరూ ఒకేదగ్గర ఉంటారు. షాక్ లో ఉన్న రిషి.. మనకు కాలేజీ పర్మిషన్ రాలేదా అని కోపంగా అరుస్తాడు. అప్పుడే ఆ సౌజన్యరావు కాల్ చేసాడు.. నిన్ను కలవడానికి ఇంటికి వస్తున్నాడంట అని రిషితో మహేంద్ర అనగానే.. ఇప్పుడెందుకని రిషి అంటాడు. ఆ తర్వాత రిషి, మహేంద్ర ఇంట్లో హాల్లో కూర్చుంటారు. ఇంతలోనే సౌజన్యరావు పూల దండతో ఎంట్రీ ఇచ్చి కంగ్రాట్స్ రిషి అంటూ తన మెడలో వేస్తాడు. కోపంలో ఉన్న రిషి.. ఆ పూలదండని తీసి నేలకేసి కొడతాడు. మన ఒప్పందం ప్రకారం మీకు పర్మిషన్ రాకుంటే.. మా కాలేజీ లో మీ కాలేజీని కలపాలని సౌజన్య రావు అనగానే.. మీరే ఏదో చేసి పర్మిషన్ రాకుండా చేసారు.. గెట్ అవుట్ అని రిషి అరుస్తాడు. మీ కాలేజీని మా కాలేజీలో కలుపుతున్నట్లు మీడియా ముందు అనౌన్స్ చెయ్యాలి అని సౌజన్యరావు అనగానే.. వసుధార, జగతిలు వస్తారు. అవును అనౌన్స్ చెయ్యాలి. మీరు తెర వెనకాల ఎంతమోసం చేసి పర్మిషన్ సంపాదించారో అని వసుధార, జగతిలు అనగానే సౌజన్యరావు షాక్ అవుతాడు. వసుధార ఫోన్ లో ఒక ఆడియో వాయిస్ వినిపిస్తుంది. అందులో సౌజన్య రావ్ DBST కాలేజీకి పర్మిషన్ రావద్దు.. మీకు ఎంత కావాలో చెప్పమని అడిగినట్లుగా అందులో ఉంటుంది. ఆ వాయిస్ నాది కాదని సౌజన్య రావు అంటాడు. అప్పుడు వసుధార, జగతిలు ఆ వాయిస్ తో ఉన్న వీడియోని చూపిస్తారు. ఇక అది చూసి బిత్తరపోయి చూస్తాడు సౌజన్యరావు. మహేంద్ర గట్టిగానే కౌంటర్ వేస్తాడు. రిషి విసిరేసిన పూలదండని మహేంద్ర తీసుకొచ్చి సౌజన్య రావు మెడలో వేసి.. గెట్ అవుట్ అని అంటాడు. దాంతో సౌజన్యరావు కోపంగా అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత రిషి తన గదిలో డల్ గా కూర్చొని ఆలోచిస్తాడు.

రిషి దగ్గరికి వెళ్ళిన వసుధార.. సర్ మినిస్టర్ గారు ఫోన్ చేసి రమ్మన్నారు.. జగతి మేడం, మహేంద్ర సర్ వెళ్లారు.. మనల్ని రమ్మన్నారని వసుధార అంటుంది. రిషి, వసుధారలు మినిస్టర్ దగ్గరికి వెళ్తారు. అక్కడే జగతి, మహేంద్ర కూడా ఉంటారు. కంగ్రాట్స్ యంగ్ మ్యాన్ మెడికల్ కాలేజీ ఎం.డి అని అనగానే రిషి ఆశ్చర్యపోతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.