English | Telugu
పెళ్ళాం లేక పిచ్చోడైపోయాడు...ఇంద్రజ రచ్చ మాములుగా లేదు!
Updated : Apr 25, 2023
జబర్దస్త్ ఒకప్పటిలా ఎంటర్టైన్ చేయలేక పోయినా ఏదో అలా నడుస్తోంది. ఇక నెక్స్ట్ వీక్ ప్రోమో రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. నెక్స్ట్ వీక్ ఎపిసోడ్ లో ఇంద్రజ రచ్చ మాములుగా లేదు. కమెడియన్స్ చెప్పాల్సిన డైలాగ్స్ బిఫోర్ గానే చెప్పేసి వాళ్లకు పని లేకుండా చేసేసింది. ప్రోమో చూస్తే ఆ విషయం అర్థమైపోతుంది. కంటెస్టెంట్స్ పాపం స్కిట్ చేద్దాం అనుకుంటే ఇంద్రజ మాత్రం రాబోయే డైలాగ్ ని ముందుగానే ఊహించేసి చెప్పేసి తానే పగలబడి నవ్వేస్తున్నారు.
ఇందులో కొంచెం కామెడీ టీమ్స్ లో సద్దాం, యాదమ్మ రాజు టీమ్ కూడా ఒకటి. రాబోయే ఎపిసోడ్ లో వాళ్ళు ఒక స్కిట్ పెర్ఫార్మ్ చేశారు. అందులో " నువ్వెందుకు పోలీస్ కావాలనుకుంటున్నావ్" అని సద్దాం అడిగేసరికి "ఏమో తెల్వదు సర్" అని చెప్పాడు యాదమ్మ రాజు. "తెలీదు అంటూ నిజాయితీగా చెప్పిన ఆయన మాటల్ని మీరు మెచ్చుకోవచ్చు" అని వాళ్ళు చెప్పాల్సిన డైలాగ్ ఇంద్రజ చెప్పేసారు. "కానీ మనోడు మంచి వేడి మీద ఉన్నాడు మేడం" అని సద్దాం అనేసరికి "వాళ్ళ ఆవిడ యూఎస్ లో ఉంది కదా" అని ఫన్నీ కౌంటర్ వేశారు ఇంద్రజ. అనుకోకుండా ఇంద్రజ నోటి నుంచి ఆ డైలాగ్ వచ్చేసరికి సద్దాం, యాదమ్మ రాజు అవాక్కయ్యారు. "అటెంషన్" అని సద్దాం చెప్పేసరికి "అంటే ఏంటి సర్" అని యాదమ్మరాజు అడిగాడు "పెళ్ళాం లేక పిచ్చోడు ఐపోయాడు" అన్నాడు సద్దాం. ఇక నూకరాజు టీమ్ కూడా ఏదో కాస్త నవ్వించడానికి ట్రై చేసింది. "నవ్వుతో యుద్దాల్ని ఆపేయొచ్చు అంటూ కామెడీ చేయడానికి ప్రయత్నించాడు. కానీ పంచ్ ప్రసాద్ వచ్చి అది చిరునవ్వా వెకిలి నవ్వు" అంటూ నూకరాజు పరువు తీసేసాడు.
ఐతే నెటిజన్స్ మాత్రం వాళ్ళ స్టయిల్లో వాళ్ళు కామెంట్స్ పెడుతూనే ఉన్నారు. "జబర్దస్త్ షో అస్సలు బాలేదు ఆపేయండి ప్లీజ్ బలవంతపు నవ్వులు వద్దు.. హైపర్ ఆది, చమ్మక్ చంద్ర చంటి, సుడిగాలి సుధీర్, వీళ్లు ఉన్నప్పుడే జబర్దస్త్ బాగుండేది ఇప్పుడు బాలేదు" అని అంటున్నారు. మరి షో మేకర్స్ ఇప్పటికైనా ఆడియన్స్ రిక్వెస్ట్ ని తెలుసుకుని వాళ్ళను జబర్దస్త్ లోకి మళ్ళీ తీసుకొస్తారో లేదో చూడాలి.