English | Telugu

పేపర్ లో వచ్చిన న్యూస్ చూసి షాకైన రిషి.. అసలు నిజం తెలుసుకుంటాడా?

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -841లో.. ఏంజెల్ గురించి విశ్వనాథ్ ఆలోచిస్తుంటాడు. నేను లేకపోతే ఏంజెల్ ని ఎవరు చూసుకుంటారు.. ఇప్పుడు మీరు ఉన్నారు కాబట్టి ధైర్యంగా ఉంది. తనకు అంటూ ఒక తోడు ఉండాలి కదా అని వసుధార, రిషిలతో విశ్వనాథ్ అంటాడు.

ఏంజిల్ పెళ్లి చేసుకుంటే నాకు ఏ టెన్షన్ ఉండదు. నీకు నచ్చిన అబ్బాయి, అర్థం చేసుకొనే అబ్బాయిని వెతికి తీసుకొని వస్తాను. పెళ్లి చేసుకుంటావా అని ఏంజిల్ ని విశ్వనాథ్ అడుగుతాడు. ఏంజిల్ సైలెంట్ గా అక్కడ నుండి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత విశ్వనాథ్ వసుధార, రిషి చేతులని తీసుకొని మీ ఇద్దరికి ఏంజిల్ బాధ్యతలు అప్పజెప్పుతున్నానని అంటాడు. మరొకవైపు వసుధార వాళ్ళ ఇంటికి వెళ్లి చక్రపాణికి విశ్వనాథ్ గురించి చెప్తుంది. మరొక వైపు రిషి కాలేజీకి వెళ్లి ప్రిన్సిపల్ సర్ తో మాట్లాడుతుండగా అప్పుడే ఇంకొక లెక్చరర్ వచ్చి.. ఒక పేపర్ తీసుకొని వచ్చి ప్రిన్సిపల్ కి ఇస్తుండగా రిషి ఆ పేపర్ తీసుకొని చదువుతాడు. పతనం దిశగా DBST కాలేజీ అనే టైటిల్ తో ఆ కాలేజీ గురించి నెగెటివ్ గా రాస్తారు. అది చూసిన రిషి ఒక్కసారిగా షాక్ అవుతాడు. బయట కూర్చొని పేపర్ ని చూస్తూ ఆలోచిస్తుంటాడు. ఒకప్పుడు ఎలా ఉన్న కాలేజీ ఎలా అయిపోయింది. ఇదంతా డాడ్ వాళ్లకి తెలుసా? డాడ్, జగతి మేడమ్ ఏం చేస్తున్నారని రిషి బాధపడుతాడు. అప్పుడే పాండియన్ అతని స్నేహితులు వచ్చి మిషన్ ఎడ్యుకేషన్ గురించి కొన్ని ప్లేసెస్ విజిట్ చేసి వచ్చామని వాళ్ళు చెప్పినా.. రిషి పట్టించుకోకుండా ఆలోచిస్తూనే ఉంటాడు. ఆ తర్వాత పాండియన్ పిలిచేసరికి వింటున్నా అంటూ ఏదో చెప్తుండగా.. అప్పుడే వసుధారని చూస్తాడు. వసుధారని చూసి ఏం చెప్పకుండా వెళ్ళిపోతాడు.

ఆ తర్వాత వాళ్ళు మిషన్ ఎడ్యుకేషన్ గురించి వసుధారతో మాట్లాడతారు. సర్ ఎందుకో ఈ పేపర్ చదివినప్పటి నుండి డల్ అయిపోయాడని చెప్పగానే.. వసుధార చూసి షాక్ అవుతుంది. మరొక వైపు పేపర్ లో DBST కాలేజీ గురించి నెగెటివ్ గా వచ్చింది జగతి, మహేంద్రలు చూసి బాధపడుతారు. ఈ పని శైలేంద్ర చేసాడని అనుకుంటారు. అప్పుడే శైలేంద్ర పేపర్ తీసుకొని వచ్చి.. ఏంటి ఇదంతా అని అందరూ నాకు ఫోన్ చేసి అడుగుతున్నారని అంటాడు. నువ్వు బోర్డు మెంబెర్ కాదు.. నిన్ను ఎందుకు అడుగుతారని మహేంద్ర అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Brahmamudi: రాహుల్ మనిషిని పట్టుకున్న రాజ్, కావ్య.. ఇక దేత్తడి!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -905 లో....అప్పు పాప కేసు ఫైల్ చూస్తుంటే ఆఫీసర్ వస్తాడు. నీకు ఎన్నిసార్లు చెప్పాను వద్దని అయినా అలాగే చేస్తున్నావని కోప్పడతాడు. లేదు సర్ పాప చనిపోలేదు.. చనిపోయిన పాప వేరు.. ఆ పాప DNA తో మ్యాచ్ అవ్వడం లేదని రిపోర్ట్స్ చూపించగానే అవునా కేసులో ఒక కొత్త మలుపు తీసుకొని వచ్చావ్ గుడ్ కేరియాన్ అని ఆఫీసర్ అంటాడు. కాసేపటికి రేపు పాప వాళ్ళ ఫాదర్ ని స్టేషన్ కి రప్పించండి అని కానిస్టేబుల్ తో అప్పు చెప్తుంది. మరొకవైపు రాహుల్ అవార్డు ఫంక్షన్ కి రాజ్, కావ్య వెళ్తారు. అక్కడ రాహుల్ డిజైన్స్ చూసి రాజ్, కావ్య షాక్ అవుతారు.

Karthika Deepam2: జ్యోత్స్న చేసిన ఫ్రాడ్ చూసి కార్తీక్, శ్రీధర్ షాక్.. ఇంటి వారసురాలు కాదేమో!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -542 లో..... కార్తీక్, శ్రీధర్ జ్యోత్స్న రెస్టారెంట్ ఫుడ్ ట్రక్స్ బాగా పాపులర్ అయ్యాయని హ్యాపీగా ఉంటారు. ఇద్దరు బయట టీ తాగుతూ కబుర్లు చెప్పుకుంటారు. జ్యోత్స్న చాలా తప్పు డు లెక్కలు చూపించిందని శ్రీధర్ అనగానే ఎంత మొన్న కొన్న ల్యాండ్ గురించా అని  కార్తీక్ అడుగుతాడు. లేదు అది జస్ట్ శాంపిల్ మాత్రమే.... ఎంత అంటే అది చెప్తే శివన్నారాయణ గుండె పట్టుకొని పడిపోయేంత డబ్బులు ఫ్రాడ్ చేసిందని శ్రీధర్ అనగానే కార్తీక్ షాక్ అవుతాడు.