English | Telugu

వాళ్ళ హనీమూన్ క్యాన్సిల్ అవ్వడానికి ముకుందనే కారణమా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న 'కృష్ణ ముకుంద మురారి' సీరియల్ ఎపిసోడ్ -80 లోకి అడుగుపెట్టింది. కాగా మంగళవారం నాటి ఎపిసోడ్ లో.. హనీమూన్ ని ఎలాగైనా క్యాన్సిల్ చెయ్యండని మురారితో కృష్ణ అంటుంది. ఇక ఇద్దరు హనీమూన్ ని ఎలా క్యాన్సిల్ చేయాలా అని ఆలోచిస్తుంటారు.

మరోవైపు నందు తన బట్టలు, బొమ్మలు సర్దుకొని కిందకి వస్తుంటుంది. తనని ముకుంద చూసి.. ఎక్కడికి వెళ్తున్నావ్ నందు అని అడుగుతుంది. ఆ తర్వాత ముకుంద ఇంట్లో అందరిని పిలుస్తుంది. రేవతి వచ్చి.. "నందు ఎక్కడికి వెళ్తున్నావమ్మా" అని అడుగగా.. కృష్ణ, మురారిలు ఊరు వెళ్తున్నారు.. కదా వాళ్ళతో నేను వెళ్తానని నందు చెప్తుంది. మురారి వచ్చి.. "నందు మేము ఎక్కడికి వెళ్ళట్లేదమ్మా" అని అంటాడు. ఇంట్లోవాళ్ళందరూ నందు కోసం తనతో అలా అంటున్నాడేమోనని భావిస్తారు. కానీ మురారి.. నేను నిజంగానే అంటున్నాను. మేము హనీమూన్ కి వెళ్ళట్లేదు. కృష్ణ చదువు ఇప్పటికే లేట్ అయింది. దానికి కావలసిన డాకుమెంట్స్ అన్ని రెడీ చేసుకోవాలని చెప్పి.. తన గదిలోకి వెళ్ళిపోతాడు. దీంతో అందరూ ఆలోచనలోపడగా.. ముకుంద మాత్రం హ్యాపీగా ఉంటుంది. ముకుందని రేవతి గమనిస్తూ.. తనే హనీమూన్ క్యాన్సిల్ చేసిందా.. వాళ్ళ హనీమూన్ క్యాన్సిల్ అవ్వడానికి కారణం ముకుందనేనా అని అనుకుంటుంది.

మురారి గదిలోకి వెళ్ళేసరికి.. కృష్ణ వాళ్ళ నాన్న ఫోటోని చూస్తూ బాధపడుతుంటుంది. ఇంతలోనే మురారి రాకని గమనించి.. నాన్న ఇంట్లో అందరూ మంచివాళ్ళే ఒక్క ఏసీపి సారే తిక్క శంకరయ్య అని మురారికి వినపడేటట్లు అంటుంది. అది విని ఏంటని మురారి అడుగుతాడు. సర్.. మీరు ఎప్పుడొచ్చారని అంటుంది. ఏదో తిక్క శంకరయ్య అంటున్నావ్ కదా అప్పుడొచ్చా అని మురారి అనగానే.. అలానే అంటానని మురారిని ఆటపట్టిస్తుంది కృష్ణ.. నేను తిక్క శంకరయ్యనా అని మురారి అనగానే.. లేదు సర్ ఆ ముకుందనే తిక్క శంకరమ్మ.. ఎప్పుడు ఏదో ఆలోచిస్తున్నట్లు.. ఎవరితో మాట్లాడదు అని కృష్ణ అంటుంది. ఇంతలోనే మురారికి ఫోన్ చేస్తుంది ముకుంద. అతను లిఫ్ట్ చెయ్యడంతో‌‌.. "నేను నీ కోసం చెయ్యలేదు. కృష్ణకి ఇవ్వు" అని ముకుంద అంటుంది. మురారి టెన్షన్ తో కృష్ణకి ఇస్తాడు. కృష్ణతో ముకుంద ఫోన్ లో ఏదో చెప్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే ‌

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.