English | Telugu

ఫ్రెండ్ షిప్ అంటే మాదే అంటున్న శ్రీహాన్-రేవంత్!

"ఆదివారం విత్ స్టార్ మా పరివారం" ప్రతీవారం లాగే ఈ వారం సరికొత్తగా ఆడియన్స్ ముందుకు రాబోతోంది. ఇక ఈ షోకి సీజన్ 6 విన్నర్ అండ్ రన్నర్ గా నిలిచినా సింగర్ రేవంత్ - శ్రీహాన్ ఇద్దరూ వచ్చారు. "ఫ్రెండ్ షిప్ అంటే రేవంత్..ఒక్కసారి నమ్మాడు అంటే జాన్ ఇస్తాడు" అని శ్రీహాన్ రేవంత్ గురించి చెప్తే " మన ముందు మనల్ని తిట్టి వెనక మన గురించి ఆలోచించేవాడు నిజమైన ఫ్రెండ్ అదే శ్రీహాన్ " అని రేవంత్ చెప్పాడు.

తర్వాత ఆర్ ఆర్ ఆర్ లో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ పెట్టిన ఫ్రెండ్ షిప్ పోజ్ పెట్టారు వీళ్ళు. ఈ ఎపిసోడ్ నెక్స్ట్ వీక్ ప్రసారం కాబోతోంది. ఇక ఈ షోకి ఫేమస్ యాక్టర్ అనుపమ పరమేశ్వరన్ ఎంట్రీ ఇచ్చింది. ఈమె నటించిన "బటర్ ఫ్లై" మూవీ సూపర్ హిట్ కొట్టిన విషయం తెలిసిందే. "వాళ్ళు వస్తే ఎంటర్టైన్ ఫిక్సు...వస్తున్నారు టాప్ 10 బిగ్ బాస్ సీజన్ 6 " అని చెప్పి శ్రీముఖి వాళ్ళను స్టేజి మీదకు ఇన్వైట్ చేసింది. "ఆదిరెడ్డి డాన్స్ కి అన్ని ఊళ్ళో ఫాన్స్ ఉన్నారు" అని చెప్పారు.

అలాగే బిగ్ బాస్ లేడీ కంటెస్టెంట్స్ అంతా ముగ్గు వేస్తున్నప్పుడు "అనుపమ చెల్లె ఇంతకు నీ పెళ్ళెప్పుడు" అని ఫైమా అడిగేసరికి అనుపమ సిగ్గుపడుతూ మెలికలు తిరుగుంటే మళ్ళీ ఫైమానే మాట్లాడుతూ " పెళ్ళీడొచ్చినప్పుడు అని ఆన్సర్ చెప్పాలి కానీ అలా మెలికలు తిరగకూడదు" అని చెప్పి అందరినీ నవ్వించింది.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.