English | Telugu
సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్న విరూపాక్ష నటుడు!
Updated : Jun 13, 2023
రవి కృష్ణ.. విరూపాక్ష మూవీతో మంచి క్రేజ్ లోకి వచ్చిన బుల్లి తెర హీరో. విరూపాక్ష మూవీలో తన నటనతో మంచి పేరు సంపాదించుకొని డేట్స్ ఖాళీ లేకుండా బిజీ జీవితం గడుపుతున్నాడు. ఇన్ని రోజులు బుల్లితెరపై సీరియల్స్ లో రవి కృష్ణని చూసిన ప్రేక్షకులు మొదటిసారిగా వెండితెరపై తన నటనను చూసి ఆశ్చర్యపోయారు.
రవి కృష్ణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయవాడ జిల్లాలో ప్రసాదంపాడు అనే గ్రామంలో జన్మించాడు.. అతనికి చిన్నప్పటి నుండి డైరెక్టర్ కావాలని ఆసక్తి ఉండేది. ఆ తర్వాత డైరెక్టర్ కావాలని చెన్నై వెళ్ళిన రవికి నిరాశ ఎదురవడంతో తిరిగి హైదరాబాద్ కి వచ్చాడు. 'విజేత' అనే సీరియల్ ద్వారా ఇతడు ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు. అప్పట్లో సూపర్ హిట్ అయినటువంటి 'మొగిలి రేకులు' సీరియల్ లో రవి కృష్ణ నటించాడు. ఆ తర్వాత మనసు మమత, హృదయం, శ్రీనివాస కళ్యాణం, వరూధిని పరిణయం వంటి సీరియల్స్ లో నటించిన రవి కృష్ణ మంచి ఫాలోయింగ్ ని సంపాదించుకున్నాడు. తర్వాత బిగ్ బాస్ సీజన్- 3 కి ఎంట్రీ ఇచ్చి ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. బిగ్ బాస్ నుండి బయటకు వచ్చాక 'ఆమె కథ' అనే సీరియల్ లో నటించిన రవి కృష్ణ.. ఆ తర్వాత ఈవెంట్స్, షోస్ లలో కన్పిస్తూ వచ్చాడు. సాయి ధరమ్ తేజ్ నటించిన 'విరుపాక్ష' మూవీలో హీరో, హీరోయిన్ ల పాత్ర తర్వాత అంతటి ప్రాముఖ్యత ఉన్న భైరవ పాత్రలో చేసిన రవి కృష్ణ నటన హైలైట్ గా నిలిచిందని చాలామంది ప్రశంసలు కురిపించారు.
రవి కృష్ణ ఎప్పటినుండో బాడీ ఫిట్ నెస్ కి ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటాడు. తన బాడీ ఫిట్నెస్ కి సంబంధించిన వీడియోస్ ని ఎప్పటికకప్పుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అవి వైరల్ అవుతుంటాయి. తాజాగా రవి కృష్ణ ఫిట్ నెస్ కి సంబంధించినది 'ది టైమ్స్ అఫ్ హైదరాబాద్' లో ఆర్టికల్ గా వచ్చింది. కాగా ఆ ఆర్టికల్ కి సంబంధించిన పోస్ట్ ని రవి తన ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసాడు. తనని తాను టైమ్స్ ఆఫ్ హైదరాబాద్ లో చూసుకోవడం చాలా హ్యాపీ గా ఉందంటూ షేర్ చేసుకున్నాడు. అయితే విరూపాక్ష మూవీతో తనలో ఒక నటుడు ఉన్నాడనే విషయాన్ని తెలుగు సినిమా ఇండస్ట్రీకి పరిచయం చేసిన రవి కృష్ణ.. ఈ సినిమా సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్నాడు.