English | Telugu

బిగ్ బాస్ హౌజ్‌లో రతిక కొత్త క్రష్.. పాపం పల్లవి ప్రశాంత్!

బిగ్ బాస్ సీజన్-7 లో ఒక్కో కంటెస్టెంట్ ది ఒక్కో స్ట్రాటజీ. ‌ఉల్టా పల్టాతో మొదలైన ఈ సీజన్ ఇప్పటికే అత్యధిక టీఆర్పీతో దూసుకెళ్తున్న విషయం తెలిసిందే. అసలు 21 మంది కంటెస్టెంట్స్ అడుగుపెడతారునుకుంటే అందరి అంచనాలని ఉల్టా పల్టా చేస్తూ 14మంది కంటెస్టెంట్స్ ని లోపలికి తీసుకొచ్చారు. అయితే మొదటి వారం కిరణ్ రాథోడ్ ఎలిమినేట్ అయింది. కాగా ఇప్పుడు కంటెంట్ కోసం స్క్రీన్ స్పేస్ కోసం ఒక్కొక్కరు ఒక్కోలా కష్టపడుతున్నారు.

కథ మొదలైంది. ఆటలు, పాటలతో పాటు గొడవలు, వినోదం ఇలా అన్నీ ఉన్నాయి. మరి లవ్ ట్రాక్.. ఎస్ ఉంది. రతిక లవ్ స్టోరీలు. మొదట ఫ్రెండ్ షిప్ అంటూ సోల్ మేట్ అంటూ పల్లవి ప్రశాంత్ కి లేనిపోని ఆశలు కల్పించిన రాధిక అలియాస్ రతిక.. సోమవారం జరిగిన నామినేషన్లో పల్లవి ప్రశాంత్ ని నానా తిట్లు తొట్టింది. ఇక ఒక్కసారిగా పల్లవి ప్రశాంత్ కి గుండె ముక్కలైంది. ఆ తర్వాత వాళ్ళిద్దరి మధ్య హౌజ్ లో మాటలే కరువయ్యాయి. కాగా తాజాగా జరిగిన ఎపిసోడ్ లో రతిక కంటెంట్ కోసం కొత్త డ్రామాని స్టార్ట్ చేసింది. మహాబలి‌ టీమ్ లోని వాళ్ళెవరు తన‌ మాట వినలేదని, తను యావర్, శివాజీలకి ఇద్దామనుకుంటే వద్దన్నారంటూ పదే పదే చెప్తుండగా.. ఆట సందీప్ తన దగ్గరికి వచ్చి.. ' నీకనపిస్తే అప్పుడే యావర్ కి ఇవ్వాల్సింది, అంతే కానీ అలా అందరు చెప్పినా వినకుండా ఉండేదానివి కాదు' అంటూ నిజాలు మాట్లాడేసరికి తన నోటివెంట మాట రాలేకపోయింది.

ఇక యావర్ హౌజ్ మేట్ కోసం జరిగే పోటీ నుండి బయటకొచ్చినందుకు చాలా బాధపడ్డాడు. అతడికి బిగ్ బాస్ కొన్ని మోటివేషనల్ మాటలు చెప్పి కూల్ చేశాడు. అయితే పల్లవి ప్రశాంత్, ప్రిన్స్ యావర్, రతిక గార్డెన్ ఏరియాలో ఉంటారు. ఇక కాసేపటికి.. ' ఐ లైక్ యూ రతిక' అని ప్రిన్స్ యావర్ అనగా.. ' ఐ లైక్ యూ టూ' అంటూ రతిక అంది. ఇక పక్కనే ఉన్న పల్లవి ప్రశాంత్ కి ఏం చెప్పాలో అర్థం కాదు. ఇక కాసేపటికి వర్షం పడుతుంటే.. గార్డెన్ ఏరియాలో ఉన్న టెర్రస్ మీద రతిక.. సోఫా చేర్ లో యావర్ ఉండగా.. అన్వర్ ఐ లైక్ యూ అంటూ రతిక అరిచేసరికి.. ఐ లైక్ యూ టూ అంటూ యావర్ అరిచేశాడు. ఇక కాసేపటికి యావర్ తో.. ఇప్పుడే కదా మొదలైంది. ముందు ముందు నీకే అర్థం అవుతుందని డైరెక్ట్ గా రతిక గురించి పల్లవి ప్రశాంత్ అన్నాడు. కానీ యావర్ కి అంతగా అర్థం కాలేదు. మరి కంటెంట్ కోసం రతిక ఎంతదాకా అయిన వెళ్తుందని స్పష్టంగా తెలుస్తుంది. యావర్ ని ఎలా తన వెంట తిప్పుకుంటుందో చూడాలి మరి.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.