English | Telugu

రష్మీ ఇంట్లో విషాదం.. కన్నీటితో తుది వీడ్కోలు

బుల్లితెర మీద ఫేమస్ యాంకర్, హీరోయిన్ రష్మీ గురించి తెలియని వారు లేరు. ప్రస్తుతం ఆమె ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. ఆమె ఫ్యామిలీలో ఒక కీలకమైన వ్యక్తి మరణించారు. ఈ విషయాన్ని రష్మీ తన ఇన్స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేసింది.

అసలు విషయంలోకి వెళితే రష్మీ గౌతమ్ బామ్మ ప్రమీలా మిశ్రా శుక్రవారం తుది శ్వాస విడిచారు. బరువెక్కిన గుండెతో కుటుంబం అంతా ఆమెకు కడసారి కన్నీటి వీడ్కోలు పలికామని పేర్కొంది రష్మీ. '' అమ్మమ్మ ప్రమీలామిశ్రా చాలా స్ట్రాంగ్ వుమన్. మాపై ఆమె ప్రభావం ఎంతో ఉంది. ఆమె మమ్మల్ని విడిచి వెళ్ళిపోయినా ఆమె జ్ఞాపకాలు మాత్రం ఎప్పుడూ మాతోనే ఉంటాయి. ఓం శాంతి'' అని రష్మీ ఒక పోస్ట్ పెట్టింది.

రష్మీ గౌతమ్ 'ఎక్స్ట్ ట్రా జబర్దస్త్', 'శ్రీదేవి డ్రామా కంపెనీ' షోలకు యాంకరింగ్ చేస్తోంది. మరోవైపు సినిమాల్లో హీరోయిన్ గా కూడా చేస్తోంది. మూవీస్ లో మంచి పాత్రలకు ఆఫర్స్ వస్తున్నాయని కానీ డిఫరెంట్ రోల్స్ కోసం వెయిట్ చేస్తున్నట్లు చెప్పింది. లాస్ట్ ఇయర్ రష్మీ హీరోయిన్ గా నటించిన 'బొమ్మ బ్లాక్ బస్టర్' సినిమా విడుదలైంది. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి హీరోగా మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్న 'భోళా శంకర్' సినిమాలో నటిస్తోంది రష్మీ.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.