English | Telugu

'డాన్స్ ఐకాన్ ఈజ్ రాకింగ్'.. గట్టిగా అరిచి చెప్పిన రమ్యకృష్ణ!


'డాన్స్ ఐకాన్' ఇలా మొదలయ్యిందో లేదో ఈ షోకి మంచి ప్రశంసలు అందుతున్నాయి ఆడియన్స్ నుంచి. ఎందుకంటే ఈ షోలో డాన్స్ మాత్రమే కనిపిస్తోంది. మిగతా డాన్స్ షోస్ లో ఎంటర్టైన్మెంట్ తప్ప డాన్స్ అనేది కనిపించడం లేదనే టాక్ సోషల్ మీడియాలో ఈ మధ్య బాగా వినిపిస్తోంది. ఐతే ఇప్పుడు డాన్స్ ఐకాన్ లేటెస్ట్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఇందులో లేడీ కంటెస్టెంట్స్ ఎక్కువగా పార్టిసిపేట్ చేస్తూ మెస్మరైజింగ్‌ పెర్ఫార్మెన్సులు చేస్తూ అందరినీ ఆకట్టుకుంటున్నారు. ఈ లేటెస్ట్ ప్రోమోలో చిన్నారి ఫ్లోరినా చేసిన డాన్స్ కి శేఖర్ మాస్టర్ మంచి కంప్లిమెంట్ ఇచ్చేసారు.. "కాంపిటీషన్ లో చేస్తున్నట్టు లేదు.. ఏదో ఇంట్లో చేస్తున్నట్టు ఉంది" అంటూ.

ఇక అల్లరి యాంకర్ శ్రీముఖి "పీఎస్ పీకే మానరిజమ్ చేసేద్దాం" అంటూ యాంకర్ ఓంకార్ చేత కూడా చేయించింది. ఇక కంటెస్టెంట్ అనుదిత పెర్ఫార్మెన్స్ కి రమ్యకృష్ణ ఫిదా ఐపోయింది. ఇక సౌమ్య పెర్ఫార్మెన్స్ కి ముగ్గురు కో - ఓనర్స్ లేచి స్టాండింగ్ ఒవేషన్ ఇస్తారు. బుట్టబొమ్మ సాంగ్ కి డాన్స్ చేసిన సౌమ్యని శేఖర్ మాస్టర్ స్టేజి మీదకి వచ్చి మరీ అభినందించారు. "ఈ బుట్టబొమ్మకు దానమ్మ, దాని అమ్మమ్మ ఎవ్వరొచ్చినా ఈమెలా చేయలేరు" అని అన్నాడు. ఇక అరుంధతి చేసిన డాన్స్ స్టేజిని హీటెక్కించింది.

దాంతో శేఖర్ మాస్టర్ ఆ వేడి భరించలేక మంచి నీళ్లు తాగేసి "అరుంధతీ.. ఇక్కడున్న వాళ్లందరినీ ఎందుకు ఇలా పరేషాన్ చేస్తున్నావ్" అనేసరికి అందరూ గట్టిగా నవ్వేశారు. ఆల్రెడీ గత ఎపిసోడ్ లో అరుంధతి పెర్ఫామెన్స్ చూసి "నువ్వు హీరోయిన్ మెటీరియల్" అని కూడా శేఖర్ మాస్టర్ కాంప్లిమెంట్ ఇచ్చిన విషయం తెలిసిందే. అరుంధతి డాన్స్ కి "సూపర్ సే ఊపర్, ఇంటర్నేషనల్ పెర్ఫార్మెన్స్" అంటూ రమ్యకృష్ణ పొగిడేసింది. "ఒకళ్ళను మించి ఒకళ్ళు అన్నట్టుగా డాన్స్ చేస్తున్నారు. డాన్స్ ఐకాన్ ఈజ్ రాకింగ్ " అంటూ గట్టిగా అరిచి మరీ చెప్పింది రమ్య కృష్ణ.