English | Telugu

నేను ఆర్జీవీని కాదు.. నువ్వు ఇలియానావి కాదు!

శ్రీదేవి డ్రామా కంపెనీ ఈ వారం షో చాలా స్పెషల్ గా డిజైన్ చేశారు. ఎందుకంటే ఆ పాత 90 స్ లో ఒక రేంజ్ లో పాపులర్ ఐన యాంకర్స్ ని పిలిచారు. అందులో "వెన్నెల" జయతి, "విహారి" కరుణా భూషణ్, పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పే సౌమ్య, ఫేమస్ మూవీ రివ్యూస్ చేసే సత్తన్న-దాసన్న, జోగి బ్రదర్, మాటల మాంత్రికుడు శేఖర్ బాషా, యాంకర్ భార్గవ్ ఎంట్రీ ఇచ్చారు. సీనియర్స్ ని పక్కన కూర్చోబెట్టి ప్రెజెంట్ యాంకరింగ్ చేస్తున్న జూనియర్స్ ని ఇన్వైట్ చేసింది రష్మీ. ఇందులో ఆరియానా, శ్రీకర్ కృష్ణ, అంజలితో పాటు యూట్యుబ్స్ లో యాంకరింగ్ చేస్తూ, ఇంటర్వ్యూస్ తీసుకునే వాళ్లంతా వచ్చారు.

"వావ్ అందరూ ఒక్కొక్క రేంజ్ లో ఎంట్రీలిస్తున్నారు..వాట్ ఏ జోష్ " అని రష్మీ అనేసరికి "జూనియర్స్ కదా ఆమాత్రం ఉంటుంది" అన్నాడు రాంప్రసాద్.. "ఐనా నా స్కెడ్యూల్ చాలా బిజీగా ఉంది...ఐనా నన్ను ఎందుకు పిలిచారు అసలు..ఏంటిదంతా..టైం వేస్ట్ ..రాజమౌళి గారితో బిజీ, త్రివిక్రమ్ గారితో బిజీ" అని సీరియస్ అయ్యింది అరియానా.. "ఐనా నువ్వు ఇలియానావి కాదు అరియానావి..గుర్తుపెట్టుకో..అర్దమయ్యిందా " అన్నాడు రాంప్రసాద్ . "కొంచెం గ్లామర్ వచ్చిందిరా నీకు" అని ఒక క్యూట్ కామెంట్ చేసేసరికి "అవునా..ఐతే నా కళ్ళు ఎలా ఉన్నాయి, నా హెయిర్ స్టైల్, నా డ్రెస్సింగ్ స్టైల్ ఎలా ఉంది మొత్తంగా నేను ఎలా ఉన్నాను" అని ఆరియానా అడిగేసరికి "ఇవన్నీ చెప్పడానికి నేనేమీ రామ్ గోపాల్ వర్మని కాదు రాంప్రసాద్ ని" అనేసరికి షాకయ్యింది అరియనా. వెంటనే "ఐనా ఇప్పుడు ఆయన గురించి ఎందుకులే..మళ్ళీ ఇంటర్వ్యూ అంటాడు, ట్రెండింగ్ అంటాడు ఆమ్మో" అంది అరియనా. "ట్రెండింగ్ అని నువ్వే వేసేసుకున్నావా" అని రాంప్రసాద్ కౌంటర్ వేసేసరికి నవ్వేసింది అరియనా.

ఇక శ్రీకర్ కృష్ణ వచ్చి రష్మీ నాకొక డౌట్ వచ్చింది..నువ్వు యాంకర్ వి కాకపోయి ఉంటే ఎం అయ్యేదానికి అని అడిగేసరికి "డాక్టర్" అని చెప్పింది. "డాక్టర్ వి కాకపోయి ఉంటే" అని మళ్ళీ అడిగాడు. "పెద్ద పెద్ద బ్రిడ్జీలు కడతారు సివిల్ ఇంజినీర్ అయ్యేదాన్ని" అని చెప్పింది. "ఇప్పుడు అర్ధమయ్యింది నాకు నువ్వు ఎప్పుడైనా జనాలు చచ్చిపోయే పనులే చేస్తావన్నమాట" అనేసరికి రష్మీ ఇచ్చిన లుక్ కి అందరూ నవ్వేశారు. శ్రీకర్ కృష్ణ ఇంతకు ముందు శ్రీదేవి డ్రామా కంపెనీలో మ్యాజిక్ చేసి అందరినీ మెస్మోరైజ్ చేసాడు. ప్రస్తుతం బ్రహ్మముడి సీరియల్ లో నెగటివ్ రోల్ చేస్తూ ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేస్తున్నాడు.


Brahmamudi Serial : దుగ్గిరాల కుటుంబం హ్యాపీ.. రుద్రాణి కన్నింగ్ ప్లాన్ అదేనా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ బ్రహ్మముడి (Brahmamudi). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-931 లో.. మినిస్టర్ కి పాప పుడుతుంది. ఆపరేషన్ తర్వత డాక్టర్ బయటకు వస్తాడు. మీకు పాప పుట్టింది అని డాక్టర్ అనగానే.. మినిస్టర్ ఫుల్ హ్యాపీగా ఉంటాడు. కానీ పాపకి ఒక ప్రాబ్లమ్ ఉందని డాక్టర్ చెప్తాడు. ఏ ప్రాబ్లమ్ ఉన్నా ఆపరేషన్ చేయించండి.. ఎంతమంది డాక్టర్ లు ఐనా , ఎక్కడి నుంచి అయినా తీసుకొచ్చి అయినా ఆపరేషన్ చేపించండి అని మినిస్టర్ అనగానే.. ఇప్పుడు చేయకూడదు.. పాప వెయిట్ తక్కువ ఉంది.. పాప పెరిగాక ఆపరేషన్ చేయాలని డాక్టర్ చెప్తాడు. వాళ్ళిద్దరూ మాట్లాడుకునేదంతా రుద్రాణి చూస్తుంది.

Illu illalu pillalu Serial:  అమూల్య ఎంగేజ్ మెంట్ ఆపడానికి భద్రవతి ప్లాన్.. భాగ్యం ఏం చేయనుంది!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు (Illu illalu pillalu). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-370 లో.. దేవుడా ఏ ఆటంకం లేకుండా ఈ నిశ్చితార్థం సవ్యంగా జరిగేలా చూడు అని దేవుడికి మొక్కుకుంటుంది వేదవతి. అప్పుడే దేవుడి దగ్గరున్న దీపాలు ఆరిపోతాయి. అయ్యో ఇదేంటి దీపాలు ఆరిపోయాయేంటని వేదవతి టెన్షన్ పడుతుంది. మరోవైపు కామాక్షి భర్త కోసం గుమ్మం దగ్గర ఎదురుచూస్తుంటుంది. అప్పుడే తిరుపతి చూస్తాడు. ఏంటమ్మా అని అడుగుతాడు. మా ఆయన కోసం ఎదురుచూస్తున్నానని కామాక్షి చెప్తుంది. అప్పుడే కామాక్షి భర్త ఆటోలో ఎంట్రీ ఇస్తాడు.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.