English | Telugu

డేంజర్ లో కావ్య, శృతి.. రాహుల్ ఎంగేజ్ మెంట్ జరుగుతుందా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ బ్రహ్మముడి. ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్-108 లో.. రాహుల్ వెన్నెలల ఎంగేజ్ మెంట్ కోసం అన్ని ఏర్పాట్లు చేస్తుంటారు. అదే సమయంలో శృతిని కలవడానికి కావ్య వెళ్ళడానికి రాజ్ ని తన ఫోన్ అడుగుతుంది. రాజ్ ని రమ్మని పిలిస్తే రానని, కావ్యకి తన ఫోన్ ఇచ్చి పంపిచేస్తాడు‌. అయితే కావ్య అలా బయటకు వెళ్తడటం బిల్డింగ్ పై నుండి గమనిస్తాడు రాహుల్. వెంటనే తన రౌడీలకు కావ్య ఎక్కడికి వెళ్తుంది.. ఎవరిని కలుస్తుంది అన్నీ తెలుసుకుని తనని ఫాలో అవమని చెప్తాడు.

అలా రాహుల్ ఫోన్ మాట్లాడుతుండగా రాజ్ వస్తాడు. రాహుల్ ని పిలుస్తున్నారని చెప్పి తీసుకెళ్తాడు. మరోవైపు కనకం-కృష్ణమూర్తిల కూతురు స్వప్నకి ఎంగేజ్ మెంట్ కి వచ్చిన ఇరుగుపొరుగు వారు.. స్వప్న లేచిపోయింది.. మళ్ళీ పెళ్ళి చేస్తున్నారు. ‌ ఆ అబ్బాయికి తెలుసో లేదో మరి అనుకుంటూ కనకంని సూటిపోటి మాటలతో అంటారు. అయితే కనకం వాళ్ళ అక్క మీనాక్షి వాళ్లకు గట్టిగా బుద్ది చెప్తుంది. దాంతో ఆ ఇరుగుపొరుగు వారు పారిపోతారు. మరోవైపు కావ్య అటోలో శృతి దగ్గరికి వెళ్తుంటుంది.

అలా ఆటోలో కావ్య వెళ్తూ దారిలో ఉన్న శృతిని కలుసుకుంటుంది. ఇద్దరు కలిసి మళ్ళీ బయల్దేరి వెళ్తుండగా వీళ్ళిద్దరిని ఫాలో అవుతున్న రాహుల్ మనషులు ఆటో ముందుకి వచ్చి కార్ ఆపుతారు. ఆ తర్వాత కత్తితో ఆటో డ్రైవర్ ని బెదిరించగా అతను పారిపోతాడు. ఇక కావ్య, శృతి ఇద్దరు అక్కడి నుండి పారిపోతుండగా రౌడీలు వెంబడించి వాళ్ళిద్దరిని పట్టుకొని కార్ లో తీసుకొని వెళ్తారు. మరోవైపు కనకం వాళ్ళింటికి వెళ్ళిన కళ్యాణ్.. కావ్య ఇచ్చిన లెటర్ ని అప్పుకి ఇస్తాడు.

స్వప్న ఎంగేజ్ మెంట్ తర్వాత ఆ లెటర్ ఇవ్వమని అప్పుతో కళ్యాణ్ చెప్పగా.. తను సరేనంటుంది. స్వప్న తన గదిలో ఉండి.. నా జీవితం ఇంతేనా.. గొప్పగా బతికలేనా అని అనుకుంటుంది. అయితే అదే సమయంలో కావ్య గురించి కనకం వాళ్ళింటికి వచ్చిన ఇరుగుపొరుగు వాళ్ళు మాట్లాడుకుంటారు. ఆ మాటలు విన్న స్వప్న.. వీళ్ళు కూడా దానిని పొగడటమేనా అని అనుకుంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.