English | Telugu

'ఆర్ఆర్ఆర్' చూసి చిరంజీవికి మెసేజ్ పంపించిన రాధ!

'బిబి జోడి' ఇప్పుడు స్టార్ మా టీవీలో వస్తోన్న డ్యాన్స్ షో అని అందరికి తెలిసిన విషయమే. ఈ షోకి యాంకర్ గా శ్రీముఖి చేస్తుండగా జడ్జిలుగా సదా, తరుణ్ మాస్టర్, రాధ వ్యవహరిస్తున్నారు.

శనివారం రాత్రి ప్రసారమైన ఈ‌ ప్రోగ్రామ్ లో సూపర్ స్టార్ రౌండ్ జరిగింది. ‌ఈ రౌండ్ లో డ్యాన్స్ చేసే బిబి‌ జోడిలు ఒక సూపర్ స్టార్ ని సెలెక్ట్ చేసుకొని ఆ హీరోకి సంబంధించిన మ్యానరిజం, ఇంకా డ్యాన్స్ చేయవలసి ఉంటుంది. ఇక మొదటి డ్యాన్స్ జోడిగా కౌశల్, అభినయశ్రీ వచ్చి.. రామ్ చరణ్ ని సూపర్ స్టార్ గా తీసుకొని పర్ఫామెన్స్ చేసారు. వీరి డ్యాన్స్ తర్వాత శ్రీముఖి పర్ఫామెన్స్ గురించి జడ్జ్ లను అడుగగా మొదట తరుణ్ మాస్టర్ బాగుందని చెప్పాడు. ఆ తర్వాత రాధ తన అభిప్రాయం చెప్తూ... "రామ్ చరణ్ ని చిన్నప్పుడు ఎప్పుడో చూసాను. కొందరు హీరోలు ఒకటి రెండు హిట్స్ వచ్చాక రిలాక్స్ అవుతారు.. కానీ రామ్ చరణ్ అలా కాదు.. ఒక్కో సినిమాకి ఇంకా కష్టపడుతూ తనని తాను మెరుగుపర్చుకుంటున్నాడు. మొన్న 'ఆర్ఆర్ఆర్' మూవీలో అతని యాక్టింగ్ చూసి ఆశ్చర్యపోయాను. అంత బాగా చేసాడు. అది చూసి రామ్ చరణ్ గురించి చిరంజీవికి ఒక పెద్ద మెసేజ్ పంపించాను. అంత పెద్ద మెసేజ్ నేను ఇప్పటివరకు ఎవరికి పంపించలేదు" అని రాధ చెప్పుకొచ్చింది.

ఆ తర్వాత జోడీగా సూర్య, ఫైమా సూపర్ స్టార్ గా ప్రభాస్ ని ఎన్నుకొని డ్యాన్స్ చేసారు. ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్‌ ని సూపర్ స్టార్ గా తీసుకొని చైతు, కాజల్ జోడి పర్ఫామెన్స్ చేసారు. అఖిల్, తేజస్విని జోడి స్టార్ గా మహేష్ బాబుని ఎన్నుకొని డ్యాన్స్‌ చేసారు. ఆ తర్వాత స్కోర్ లో కౌశల్, అభినయశ్రీ జోడీ లీడింగ్ స్థానంలో ఉన్నారు. డేంజర్ జోన్ లో‌ అఖిల్, తేజస్విని ఉన్నారు. ఆదివారం ప్రసారం కాబోయే ఎపిసోడ్‌లో ఈ జోడీలలో నుండి ఎవరు ఎలిమినేట్ అయ్యి బయటకు వెళ్తారో తెలుస్తుంది.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.