English | Telugu

రచ్చ రవి కారు కొంటే ఆ రచ్చే వేరప్పా!

దసరా వచ్చిందంటే చాలు సాధారణంగా ఆఫర్స్ ఉంటాయని రకరకాల వస్తువులు కొనేస్తూ ఉంటారు చాలామంది. ఐతే ఇక్కడ సెలబ్రిటీస్ మాత్రం దసరా సందర్భంగా అందరూ కార్లు కొనేసి తెగ ఫోజులు ఇచ్చేస్తున్నారు. ఒకప్పుడు కార్ కొనాలంటే డబ్బు కూడబెట్టి చూసి చూసి కొనుక్కోవాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు చాకోలెట్స్ కొన్నట్టు కార్లు కొనేస్తున్నారు. మొన్న షణ్ముఖ్ జస్వంత్ బిఎండబ్ల్యూ కొంటే నిన్న పవిత్ర ఐ20 కొనేసింది. ఇక ఈరోజు రచ్చ రవి నెక్సా గ్రాండ్ వింటారా కార్ కొనేసాడు. రచ్చ రవి బుల్లితెర, వెండితెరపై తన సత్తా చాటుతున్నాడు. బాగానే సంపాదిస్తున్నాడని కూడా తెలుస్తోంది.

జబర్దస్త్ షోలో చమ్మక్ చంద్ర టీంలో పని చేసి బాగానే పాపులర్ అయ్యాడు ర‌వి. అలా సొంతంగా టీమ్‌ లీడర్ స్థాయికి వెళ్లాడు. తర్వాత నాగబాబుతో చమ్మక్ చంద్ర, ఆయనతో రచ్చ రవి జబర్దస్త్ నుంచి బయటికి వచ్చేసారు. తర్వాత అవకాశాలు రాక మళ్ళీ మల్లెమాలకు వచ్చేసాడు. ఇటీవల జరిగిన ఒక ఈవెంట్ లో జబర్దస్త్ తనకు అమ్మ లాంటిది అంటూ ఎమోషన్ అయ్యాడు.

ఇప్పుడు రచ్చ రవి తన కొత్త కారుకు సంబంధించిన వీడియోను షేర్ చేశాడు.షోరూమ్‌లో ఆ కారుతో త‌ను చేసిన ర‌చ్చ‌ను వీడియో రూపంలో పంచుకున్నాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక రచ్చ రవికి నెటిజన్స్ కంగ్రాట్స్ చెబుతున్నారు. "పార్టీ ఎప్పుడూ?" అంటూ అడుగుతున్నారు.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.