English | Telugu

నాకు రొమాన్స్ ఇష్టం...ఆ సీన్ లో అద్దం ముక్కలు మీద పడేసరికి భయమేసింది అన్న కేశవ


ఆహా ఓటిటి వేదిక మీద స్ట్రీమ్ అవుతున్న" సత్తిగాని రెండెకరాలు" మూవీ తెలుగు ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయ్యింది. ఈ మూవీలో నటించిన పుష్ప కేశవ చాలా బాగా నటించాడు. మూవీ ప్రొమోషన్స్ లో భాగంగా కేశవ , మోహనశ్రీ టేస్టీ తేజతో కలిసి ముచ్చట్లు పెట్టారు. "నేను వరంగల్ లోని లాల్ బహదూర్ కాలేజ్ లో బి.ఎస్సి పౌల్ట్రీ సైన్స్ చదివాను. అంటే సింపుల్ గా చెప్పాలంటే కోళ్ల డాక్టర్ లెక్క..కోళ్ల ఫారాలకు వెళ్లి అక్కడ కోళ్ల పరిస్థితిని చూసుకునే చదువు అది. ఈ మూవీ డైరెక్టర్ అభినవ్ రెడ్డితో ఎడిటర్ గా ఉన్న టైంలో అంటే 2019 లో "గాడ్స్ ఆఫ్ ధర్మపురి" అని మూవీ చేసాను.

నేను ప్రస్తుతం ఈ సత్తిగాని రెండెకరాలు మూవీలో లీడ్ రోల్ చేస్తున్నట్లు బన్నీ గారికి చెప్పాను. ఇంకా మంచి మంచి క్యారెక్టర్స్ ని సెలెక్ట్ చేసుకుని చెయ్యి అన్నారు. ఆయన ఎప్పుడూ సపోర్టివ్ గా ఉంటారు. పుష్ప 2 షూటింగ్ జరుగుతోంది ప్రస్తుతం. ఈ మూవీ ఒక మిడిల్ క్లాస్ పర్సన్ ని బాగా కనెక్ట్ చేస్తుంది..ఇందులో ఒకటి మర్చిపోలేని ఇన్సిడెంట్ ఉంది. కార్ కి అద్దం పెట్టి పగలగొట్టమని చెప్పారు. ఐతే అది పగలగొట్టినప్పుడు ఆ గాజు పెంకులు మీదకు పడ్డాయి..దాంతో చాలా భయమేసింది. నా ఫస్ట్ లవ్ వచ్చేసరికి 2nd క్లాస్ చదివేటప్పుడు ఒక అమ్మాయిని చూసాను చాలా బాగుండేది..బాగా చదివేది...ప్రస్తుతం తనకు పెళ్లయిపోయింది" అని చెప్పాడు కేశవ అలియాస్ జగదీశ్ ప్రతాప్ బండారి. "నేను ఫాషన్ కమ్యూనికేషన్ చదివాను. అంటే ఫాషన్ లో ఒక జర్నలిజం లాంటిది. మాదాపూర్ లో ఉన్న నిఫ్ట్ లో ఈ కోర్స్ చేసాను.

మాది యానాం. సరదాగా ఆడిషన్ ఉంది అంటే పంపించాను...తర్వాత అభినవ్ కాల్ చేసాడు. అంతా ఓకే అయ్యింది. అప్పుడు తెలంగాణ యాసలో మాట్లాడ్డం నేర్చుకున్న మా ఫ్రెండ్స్ తో ఆ యాసలో మాట్లాడ్డం మొదలుపెట్టా..డైరెక్టర్ అభినవ్ నాకు స్టోరీ చెప్పలేదు...సీన్ పంపిస్తే ఆడిషన్ ఇచ్చా..స్టోరీ అడిగితే స్క్రిప్ట్ పంపిస్తాను చదువుకో అన్నారు. ఈ మూవీలో నా రోల్ కానీ, సాంగ్స్ కానీ చాలా బాగుంటాయి...ఇక నేను పెళ్లి చేసుకోబోయే అబ్బాయిలో క్వాలిటీస్ ఎలా ఉండాలి అంటే నాకు ఆకలేసినప్పుడు ఫుడ్ ఆర్డర్ చేయాలి..రోజుకో మూడు సార్లు ఐ లవ్ యు కన్నా, బుజ్జి అని చెప్పాలి..అప్పుడప్పుడు షాపింగ్ లకు వాటికి తీసుకెళ్ళాలి. యాక్ట్యువల్ గా చెప్పాలంటే నాకు రొమాన్స్ అంటే చాలా ఇష్టం. నేను చిన్నప్పుడు దిల్ మూవీ చూసాను. అప్పుడు అనిపించింది నాకు నితిన్ లాంటి బాయ్ ఫ్రెండ్ కావాలి అనిపించింది. నాకు ఫైట్స్, చేజెస్ అంటే ఇష్టం..కానీ ఇన్ని ఎక్స్పెక్టేషన్స్ ఇలా ఉండేసరికి నాకు ఎవరూ సెట్ కావట్లేదు అనుకుంటా" అని చెప్పింది మోహనశ్రీ.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.