English | Telugu
"లిటిల్ హార్ట్" తో భానుకి ప్రొపోజ్ చేసిన సింగర్ రమణ
Updated : Nov 9, 2022
స్పెషల్ ఈవెంట్స్ ని, పండగలను బాగా కాష్ చేసుకోవడంలో బుల్లితెర ముందుంటుంది. ఇక ఇప్పుడు 14 వ తేదీ చిల్డ్రన్స్ డే రాబోతున్న సందర్భంగా ఒక కొత్త షో ఈటీవీలో ప్రసారం కావడానికి సిద్దమయ్యింది. దీనికి సంబంధించిన ప్రోమో రిలీజ్ అయ్యింది. ‘లిటిల్ హార్ట్స్’ అనే ఒక కొత్త ప్రోగ్రాంని అనౌన్స్ చేశారు మేకర్స్. ఇక ఈ న్యూ స్పెషల్ ఈవెంట్ ని నవంబర్ 13 ఆదివారం రాత్రి 7:00 గంటలకు ఈటీవీలో ప్రసారం కాబోతోంది. ప్రోమోలో బుల్లితెర సెలబ్రిటీలంతా వారి వారి పిల్లలతో కలిసి హాజరయ్యారు. స్టేజ్ పై పేరెంట్స్ కి, పిల్లలకు మధ్య సరదాసరదా పోటీలు, డాన్సులు వంటివి చేయించారు. ఈ కార్యక్రమాన్ని హైపర్ ఆది హోస్ట్ చేసాడు.
ఇక ఈ ప్రోగ్రాంలో "పల్సర్ బైక్ ఫేమ్ సింగర్ రమణ" స్పెషల్ పెర్ఫార్మెన్స్ తో అదరగొట్టాడు. ఈసారి యాట నవీన, వర్ష, భాను పేర్లు వచ్చేలా ఒక సాంగ్ రాసి పాడాడు. ఇలాంటి పాట ఎప్పుడైనా విన్నావా అని అంటూనే మోకాలిపై కూర్చుని ఆమెకు హార్ట్ షేప్ రెడ్ బెలూన్ ఇచ్చి ప్రపోజ్ చేశాడు. దీంతో భాను కూడా స్టేజిపైనే తెగ సిగ్గుపడిపోయింది. అన్ని కుదిరితే భాను, రమణ రీల్ పెయిర్ రాబోయే రోజుల్లో కనిపిస్తుందేమో అనిపిస్తోంది...ఎందుకంటే సుధీర్, రష్మీ, వర్ష, ఇమ్ము పెయిర్స్ చేసే ఎంటర్టైన్మెంట్ కొంచెం పాతబడిపోయింది. ఆడియన్స్ కొత్త పెయిర్ ని, కొత్త కనెక్షన్స్ ని, కొత్త ఎంటర్టైన్మెంట్ ని కోరుకుంటున్నారు కాబట్టి వీళ్ళను రాబోయే రోజుల్లో బాగా హైలైట్ చేసి చూపించబోతున్నారేమో చూడాలి...ఇక రమణ భానుకి రెడ్ బెలూన్ ఇచ్చేసరికి నెటిజన్స్ రమణని తెగ తిట్టిపోస్తున్నారు.