English | Telugu

సుమ అడ్డాలో 'పులిమేక' వెబ్ సిరీస్ టీం సందడి!

ఈటీవీలో ప్రసారమవుతున్న 'సుమ అడ్డా' షోకి యాంకర్ గా సుమ చేస్తుందని అందరికీ తెలిసిన విషయమే. అయితే ఈ వారం జరిగిన ఎపిసోడ్ లో 'పులిమేక' వెబ్ సిరీస్ టీం సందడి చేశారు. ఈ సిరీస్ తాజాగా జీ5లో విడుదలై విశేష స్పందన పొందుతోంది. అయితే సిరీస్ టీం‌మ్ తాజాగా సుమ అడ్డా ఎపిసోడ్ లో గెస్ట్ లు గా వచ్చారు. అందులో హీరోయిన్ లావణ్య త్రిపాఠి, రచయిత కోన వెంకట్, సిరి హనుమంత్, రాజా చెంబోలు పాల్గొన్నారు. దీంతో ఈ షో ఆసక్తికరంగా సాగింది.

ఈ సిరీస్ లో నువ్వేం చేసావ్ సిరి అని సుమ అడుగగా.. యాక్టింగ్ చేసానని సిరి చెప్పింది.. పోనీలే సిరి ఇన్నాళ్ళకి నీకు యాక్టింగ్ చేయాలని అర్థం అయిందని సుమ పంచ్ వేసింది. సిరి నీకొక కొశ్చన్.. రిలేషన్ షిప్ ల వల్ల నువ్వు పాపులర్ అయ్యావా లేక యాక్ట్ చేయడం వల్ల పాపులర్ అయ్యావా? అని సుమ ప్రశ్నించగా.. రిలేషన్ షిప్ లో యాక్టింగ్ చేయడం వల్ల పాపులర్ అయ్యానని చెప్పింది. సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి కొడుకని కాకుండా మీరంతట మీరు ఒక‌ గుర్తింపుని తెచ్చుకున్నారు కదా రాజా చెంబోలు గారు గ్రేట్ అని సుమ అభినందించింది. ఆ తర్వాత లావణ్య త్రిపాఠి వచ్చి.. 'మీరు ఎప్పటిలాగే బాగున్నారు.. గ్రేట్' అని సుమతో చెప్పగా.. అదేంటో రోజు రోజుకి నా అందం అలా పెరిగిపోతూ ఉంటుందని సుమ చెప్పింది. మీ నాన్న గారు లాయర్, అమ్మ టీచర్, చెల్లి డాక్టర్ మీరేంటి ఒక ఎడ్యుకేషనల్ ఇన్సిట్యూట్ రన్ చేస్తున్నారా అని సుమ అడిగేసరికి.. లావణ్య నవ్వేయగా.. ప్రేక్షకులు ఊ కొడుతూ ఫుల్ ఎంజాయ్ చేశారు.

ఆస్క్ మీ కొశ్చన్ రౌండ్ లో లావణ్య తప్పుగా సమాధానం చెప్పినందుకు గాను ఒక పనిష్మెంట్ ఇచ్చింది సుమ. అదేంటంటే లావణ్య ఒక వెడ్డింగ్స్ చేసే కంపెనీకి హెడ్ అని, తను మేడమ్ అసిస్టెంట్ అని సుమ స్టార్ట్ చేయగా.. పెళ్ళిచూపుల దగ్గర నుండి శ్రీమంతం వరకు మేడమే గ్యారంటీ అని సుమ చెప్తుంది.. వెంటనే డైవర్స్ గ్యారంటీ అని లావణ్య అంటుంది. దీంతో సుమ షాక్ అవుతుంది. ఆ తర్వాత కామన్ ఆడియన్స్ లో నుండి ఒక స్టూడెంట్ వచ్చి.. నాకు లావణ్య త్రిపాఠి లాంటి అమ్మాయి కావాలి అని అంటాడు. "లావణ్య లాంటి అమ్మాయంటే కన్యాశుల్కం ఇవ్వాలి" అని సుమ చెప్తుంది. దానికి అతను.. "నా ప్రాణాలే ఇస్తాను" అని చెప్తాడు. ఒకవేళ లావణ్య అలిగితే ఏం చేస్తావ్? అని సుమ అడుగుతుంది. ఒక‌ రొమాంటిక్ డేట్ కి తీసుకెళ్తానని చెప్పగా.. అలిగిందే నీకు రొమాన్స్ లేదనేరా అని సుమ పంచ్ వేసేస్తుంది. దీంతో షోలో నవ్వులు పూసాయి. ఇలా షో అంతా సుమ కామెడీ పంచ్ లతో వీక్షకులకు ఫుల్ మస్తీ ఎంటర్‌టైన్మెంట్ లభించింది.

Illu illalu pillalu : నర్మద జాబ్ పోయేలా చేసిన భద్రవతి.. ప్రేమ వెళ్ళిపోయిందిగా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -310 లో...... నర్మద ఆఫీస్ కి వెళ్తూ వేదవతి దగ్గరికి వచ్చి మాట్లాడుతుంది కానీ వేదవతి మాత్రం సైలెంట్ గా ఉంటుంది. అత్తయ్య నేను ఆఫీస్ కి వెళ్ళేటప్పుడు నాతో నవ్వుతూ మాట్లాడాలి లేదంటే నాకు మంచి జరగదని నర్మద అంటుంది అయినా సైలెంట్ గా వేదవతి ఉంటుంది. అర్ధం అయింది నేను మీ వాళ్లకి ఎదురువెళ్తున్నానని కోపంగా ఉంది కదా.. నా డ్యూటీ నేను చేసానని నర్మద చెప్పి వెళ్ళిపోతుంది. కోపం కాదు బాధ మా వాళ్ళు నిన్ను ఏదైనా చేస్తారని భయంగా ఉందని వేదవతి అనుకుటుంది.

పృద్వి కోసం విష్ణు ప్రియ...ఆ షోకి అందుకే వెళ్లాను!

బిగ్ బాస్ లో రొమాంటిక్ కపుల్ గా విష్ణు ప్రియా - పృథ్వి జోడి మంచి పేరు తెచ్చుకుంది. ఒకరు లేకపోతె ఇంకొకరు లేరు అన్నట్టుగా ఉండేవాళ్ళు. కానీ బిగ్ బాస్ హౌస్ నుంచి వచ్చాక పృథ్వి విష్ణు ప్రియను పట్టించుకోవడం మానేసాడు. విష్ణు ప్రియా మాత్రం పృద్వి జపం చేస్తూ ఉంటుంది. కానీ అతను ఇద్దరం ఫ్రెండ్స్ అని మాత్రమే అనేవాడు. అలాంటి పృద్వి గురించి విష్ణు ప్రియా ఒక ఇంటర్వ్యూలో కొన్ని విషయాలు చెప్పింది . "కిర్రాక్ బాయ్స్ ఖిలాడీ గర్ల్స్ షో గురించి చెప్పాలంటే ఎం చెప్తావ్" అని విష్ణు ప్రియను హోస్ట్ అడిగింది. "నాకు దేవుడు రెండు సార్లు షోకి వెళ్ళడానికి ఛాన్స్ ఇచ్చాడు. ఫస్ట్ సీజన్ లో బేవార్సు వాళ్ళతో ఫ్లర్ట్ చేసాను.