English | Telugu

సుమ అడ్డా నుండి వెళ్ళిపోయిన పృథ్వీరాజ్.. అసలేం జరిగింది?

ఈటీవీలో ప్రసారమవుతున్న షోలలో సుమ అడ్డా ఒకటి. సుమ యాంకరింగ్ చేస్తున్న ఈ షో ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సుమ తనదైన యాంకరింగ్, పంచ్ లతో షోని ప్రేక్షకులకు చేరువ చేసింది. షోలో ఆమె పుంచ్ ల దాటికి ఎవరూ నిలబడలేరు. మంచి కామెడీ టైమింగ్ తో, తన స్పాంటేనియస్‌ పంచ్ లతో స్టార్ నటీనటులకి సైతం చెమటలు పట్టించేస్తుంది సుమ. ఈ షోకి కొందరు సెలబ్రిటీలను తీసుకొచ్చి.. వారితో సరదగా గేమ్స్ ఆడిస్తూ కామెడీగా వారిని ఆటపట్టిస్తూ అలరిస్తోంది.

అయితే ఈ వారం సుమ అడ్డాలో స్పెషల్ గెస్ట్ లుగా హిమజ-ప్రభాస్ శ్రీను ఒక టీంగా, పృథ్వీరాజ్-జ్యోతిలు ఒక టీంగా వచ్చారు. "నేను మా ఆవిడ" అని హిమజని చూపిస్తూ ప్రభాస్ శీను అంటుండగా... ఏం అన్నారంటూ హిమజ దూరం వెళ్తుంది. దాంతో అందరూ ఒక్కసారిగా నవ్వుతారు. ఆ తర్వాత జ్యోతిని నువ్వేం కోరుకుంటావని సుమ అడుగగా.. అందరూ బాగుండాలి.. అందులో నేనుండాలని కోరుకుంటా అని జ్యోతి చెప్తుంది. మరి మీరేం కోరుకుంటారని పృథ్వీరాజ్ ని అడుగగా.. అందరూ బాగుండాలి.. బ్యాంకాక్ లో నేనుండాలి అంటూ పృథ్వీరాజ్ చెప్తాడు. దాంతో అందరూ నవ్వేస్తారు. ఆ తర్వాత పృథ్వీరాజ్ పక్కనే ఉన్న జ్యోతి చేయి తీసుకొని చూస్తుండగా అది చూసిన సుమ.. ఇక్కడ నేనేమో రూల్స్ చెప్తున్నాను.. ఆయనేమో అక్కడ తనకి చిలక జ్యోష్యం చెప్తున్నాడని అనగానే షో అంతా నవ్వేస్తారు.

ఒక నటుడి చిన్నప్పటి ఫోటోని, ఆ ఫోటో పక్కనే సగం కనిపించేలా నాగార్జున ఫోటోని చూపించి.. అది ఎవరని సుమ గెస్ చేయమని చెప్పగా.. అది నాగార్జున ఫోటో అని పృథ్వీరాజ్ చెప్తాడు. కాదని సుమ అనగా.. అలా ఎలా అంటారు.‌ ఒక పక్క నాగార్జున ఫోటో క్లియర్ గా తెలుస్తుంది కదా అని పృథ్వీరాజ్ అంటాడు. అది కాదండి మా వాళ్ళు ఒక్కో ఫోటోని ఒక్కోలా డిజైన్ చేస్తారని సుమ అనగానే.. ఇది అంతా తప్పు ఈ షో లో నేనుండలేనని చెప్పి పృథ్వీరాజ్ షో మధ్యలో నుండి వెళ్ళిపోతాడు. అయితే ఇదంతా షో మీద ఆసక్తి కలిగించడానికి చేసినదా? లేక నిజంగానే పృథ్వీరాజ్ ఈ షో నుండి వెళ్ళిపోయాడా? తెలియాలంటే పూర్తి ఎపిసోడ్ వచ్చేవరకు ఆగాల్సిందే.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.