English | Telugu

బెడ్ రూమ్‌లో నందు పెళ్ళి పత్రిక... కృష్ణని కొట్టడానికి చేయెత్తిన మురారి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -133 లో.. భవాని దగ్గరికి ఈశ్వర్ వచ్చి నందు పెళ్లి గురించి మాట్లాడుతాడు. నందుకి కాబోయే అత్తవారింట్లో మర్యాదలు బాగున్నాయి.. మన నందు వాళ్ళింట్లో హ్యాపీగా ఉంటుందని ఈశ్వర్ అంటాడు. అందుకే కదా ఈ పెళ్లి చేస్తున్నాను.. ఆ తింగరిపిల్లకి ఇదంతా తెలియకుండా ఉండాలి.. లేదంటే ఏ తింగరి పనైనా చేస్తుందని భవాని అంటుంది. ఆ తర్వాత కృష్ణ, మురారి లు రెస్టారెంట్ కి వెళ్ళి వస్తారు. వాళ్ళిద్దరిని చూసి రేవతి ఎక్కడికి వెళ్లారని అడుగుతుంది. మురారి రెస్టారెంట్ లో జరిగిందేమీ చెప్పకని కృష్ణకి చెప్పినా తనేం వినిపించుకోకుండా.. మేమిద్దరం స్వీట్స్ తినిపించుకున్నామని చెప్తుంది.

ఆ తర్వాత నందు కోసం తన గదిలోకి వెళ్తుంది కృష్ణ. నందు గదిలో లేకపోవడంతో ఇల్లంతా వెతుకుతుంది. నందు అని పిలుస్తూ.. హాల్లో కి వస్తుంది. అక్కడే హాల్లో ఉన్న భవానీ‌ని.. నందు ఎక్కడ అత్తయ్య అని అడుగుతుంది. నాకూతురు గురించి నీకెందుకని భవాని అనగానే.. నందు నా పేషెంట్.. ఇంకా నేను ఈ ఇంటికి కోడలిని.. మీ వారసుడు తాళి కట్టిన భార్యనంటూ తాళిని చూపిస్తుంది కృష్ణ. నా కొడుకు నీ మెడలో తాళి కట్టాడు కాబట్టే నిన్ను ఈ ఇంట్లో ఉండనిస్తున్నాను అని భవాని అంటుంది. అసలు నందుని ఏం చేశారు.. ఊర్లు దాటించారా? రాష్టాలు దాటించారా? దేశాలు దాటించారా అని కృష్ణ ఆవేశంగా అడుగుతుంది. నీ భార్యని అదుపులో పెట్టుకో మురారి అని ఈశ్వర్ అంటాడు. మీ భార్యను మీరు ఇంట్లో ఏం మాట్లాడకుండా అదుపులో పెట్టినట్లు.. అందరూ అలా ఉండలేరు కదా అని పక్కనే ఉన్న రేవతి అంటుంది. పద కృష్ణ వెళ్దామని మురారి అంటాడు. అయినా తను వినకుండా మొండిగా ప్రవర్తిస్తుంటే మురారి తనని కొట్టడానికి చెయ్ ఎత్తుతాడు. మురారి అలా చేసేసరికి కృష్ణ బాధపడుతుంది. నందు ఎక్కడికి వెళ్ళిందో చెప్పకుండానే.. హాల్లో ఉన్న వాళ్ళందరు.. ఎవరి గదుల్లోకి వాళ్ళు వెళ్తారు. కృష్ణ తన గదిలోకి వెళ్లి నందు గురించి ఆలోచిస్తుంటుంది.

మరోవైపు రేవతి బెడ్ సర్దుతూ.. ఈ ఇంట్లో అందరికి నోళ్లు ఎక్కువ అయిపోయాయి.. ఏదేదో మాట్లాడుకుంటున్నారు.. నేను వెళ్లేసరికి మాట మార్చుతున్నారు.. నా కోడలికి ఏమైనా ఐతే అసలు ఊరుకోను.. అయినా నా కోడలు మొండిది.. అనుకున్నది జరిగే వరకు ఊరుకోదని అంటుంది. అలా రేవతి బెడ్ సర్దుతుండగా బెడ్ కింద నందుది పెళ్ళి పత్రిక కనిపిస్తుంది. అది చూసిన రేవతి షాక్ అవుతుంది. నందు పెళ్ళి పత్రిక చూసిన రేవతి ఈ విషయం గురించి కృష్ణకి చెప్తుందా లేదా తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Brahmamudi Serial : దుగ్గిరాల కుటుంబం హ్యాపీ.. రుద్రాణి కన్నింగ్ ప్లాన్ అదేనా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ బ్రహ్మముడి (Brahmamudi). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-931 లో.. మినిస్టర్ కి పాప పుడుతుంది. ఆపరేషన్ తర్వత డాక్టర్ బయటకు వస్తాడు. మీకు పాప పుట్టింది అని డాక్టర్ అనగానే.. మినిస్టర్ ఫుల్ హ్యాపీగా ఉంటాడు. కానీ పాపకి ఒక ప్రాబ్లమ్ ఉందని డాక్టర్ చెప్తాడు. ఏ ప్రాబ్లమ్ ఉన్నా ఆపరేషన్ చేయించండి.. ఎంతమంది డాక్టర్ లు ఐనా , ఎక్కడి నుంచి అయినా తీసుకొచ్చి అయినా ఆపరేషన్ చేపించండి అని మినిస్టర్ అనగానే.. ఇప్పుడు చేయకూడదు.. పాప వెయిట్ తక్కువ ఉంది.. పాప పెరిగాక ఆపరేషన్ చేయాలని డాక్టర్ చెప్తాడు. వాళ్ళిద్దరూ మాట్లాడుకునేదంతా రుద్రాణి చూస్తుంది.

Illu illalu pillalu Serial:  అమూల్య ఎంగేజ్ మెంట్ ఆపడానికి భద్రవతి ప్లాన్.. భాగ్యం ఏం చేయనుంది!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు (Illu illalu pillalu). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-370 లో.. దేవుడా ఏ ఆటంకం లేకుండా ఈ నిశ్చితార్థం సవ్యంగా జరిగేలా చూడు అని దేవుడికి మొక్కుకుంటుంది వేదవతి. అప్పుడే దేవుడి దగ్గరున్న దీపాలు ఆరిపోతాయి. అయ్యో ఇదేంటి దీపాలు ఆరిపోయాయేంటని వేదవతి టెన్షన్ పడుతుంది. మరోవైపు కామాక్షి భర్త కోసం గుమ్మం దగ్గర ఎదురుచూస్తుంటుంది. అప్పుడే తిరుపతి చూస్తాడు. ఏంటమ్మా అని అడుగుతాడు. మా ఆయన కోసం ఎదురుచూస్తున్నానని కామాక్షి చెప్తుంది. అప్పుడే కామాక్షి భర్త ఆటోలో ఎంట్రీ ఇస్తాడు.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.