English | Telugu
తగ్గేదేలే.. మా టీమ్ నుంచి ఇద్దరు టాప్ లో ఉంటారు
Updated : Nov 27, 2022
సౌత్ ఇండియాస్ బిగ్గెస్ట్ డాన్స్ షో ఐన 'డాన్స్ ఐకాన్' గ్రాండ్ ఫినాలేలోకి ఎంట్రీ ఇచ్చేసింది. ఇక కంటెస్టెంట్స్ మధ్య పోటీ మాములుగా లేదు. ఈ నేపథ్యంలో పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ప్రొడ్యూసర్ వివేక్ కూచిబొట్లను అడిగిన కొన్ని ప్రశ్నలకు ఆయన ఇలా సమాధానాలు ఇచ్చారు. డాన్స్ కంటెస్టెంట్స్ వేలం పాటలో ఈయన ఆసిఫ్ ని, అరుంధతిని దక్కించుకున్నారు.
"గ్రాండ్ ఫినాలేలో మీ కంటెస్టెంట్స్ ఇద్దరూ ఉండడం మీకెలా అనిపిస్తోంది?" అని అడగగా.. "చాలా హ్యాపీగా ఉంది. ఇద్దరూ చాలా పర్ఫెక్ట్ గా చేస్తారు." అన్నారు. "మీ ఇద్దరి కంటెస్టెంట్స్ లో మీ ఫేవరేట్ ఎవరు?" అనే ప్రశ్నకు "నేను ఒకళ్లు ఎక్కువ, ఒకళ్ళు తక్కువ అని చెప్పను. నాకు ఇద్దరూ చాలా ఇంపార్టెంట్." అనే సమాధానం ఇచ్చారు. "మీ ఇద్దరి కంటెస్టెంట్స్ లో టాప్ 2 లో ఎవరుంటారని అనుకుంటున్నారు?" అని అడగటంతో "మా టీమ్ నుంచి ఆ ఇద్దరూ ఉండాలని కోరుకుంటున్న. ఇద్దరికీ నా బెస్ట్ విషెస్ చెప్తున్నా..బాగా చేయండి. విన్ అవ్వండి." అన్నారు. మీ ఇద్దరి కంటెస్టెంట్స్ లో ఎవరిదీ బెస్ట్ పెర్ఫార్మెన్స్ అని మీరు అనుకుంటున్నారు? అడగగా.. "అరుంధతి చేసిన 'పరేషాను'రా అనే సాంగ్ కి చేసిన డాన్స్ ది బెస్ట్." అని తన కంటెస్టెంట్స్ గురించి చెప్పారు.. అలాగే వాళ్లకు ఆల్ ది బెస్ట్ అని చెప్పారు.