English | Telugu
సౌమ్య కచ్చితంగా విన్నర్ అవుతుంది.. ఫ్లోరీనా అందరికీ గట్టి పోటీ ఇస్తోంది
Updated : Nov 27, 2022
యాంకర్ ఓంకార్ హోస్ట్ చేస్తున్న సౌత్ ఇండియాస్ బిగ్గెస్ట్ డాన్స్ షో ఐన 'డాన్స్ ఐకాన్' ఇప్పుడు గ్రాండ్ ఫినాలేకి దగ్గర పడింది. ఐతే ఇప్పుడు పోటీ మంచి రసవత్తరంగా సాగుతోంది. ఈ నేపథ్యంలో మైత్రి మూవీ మేకర్స్ ప్రొడ్యూసర్ రవిశంకర్ ని అడిగిన కొన్ని ప్రశ్నలకు ఆయన సమాధానాలు ఇచ్చారు. కంటెస్టెంట్స్ వేలం పాటలో ఈయన ట్రోన్ బ్రదర్స్ ని, సౌమ్య అనే కంటెస్టెంట్ ని దక్కించుకున్నారు.
"గ్రాండ్ ఫినాలేలో మీ కంటెస్టెంట్స్ ఇద్దరూ ఉండడం మీకెలా అనిపిస్తోంది?" అని అడగగా.. "నేను సెలెక్ట్ చేసుకున్న ఇద్దరూ ఉండడం నిజంగా చాలా హ్యాపీగా ఉంది. వీళ్ళ డాన్స్ మాములుగా ఉండదు. రన్నర్, విన్నర్ కూడా వీళ్ళే అవ్వాలి, ట్రోఫీని సొంతం చేసుకొవాలి అనుకుంటున్నా" అన్నారు. "మీ ఇద్దరి కంటెస్టెంట్స్ లో మీకు ఎవరంటే ఇష్టం?" అని అడగటంతో.. "సౌమ్య అంటే ఇష్టం. కచ్చితంగా విన్నర్ అవుతుంది." అని చెప్పారు. "మీ కంటెస్టెంట్స్ చేసిన బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఏది?" అనే ప్రశ్నకు "సౌమ్య చేసిన బుట్ట బొమ్మ సాంగ్ ది బెస్ట్" అని సమాధానం ఇచ్చారు. "మీ కంటెస్టెంట్స్ కి గట్టి పోటీని ఇచ్చే కంటెస్టెంట్ ఎవరు?" అని అడగగా.. "అల్లు అరవింద్ గారు సెలెక్ట్ చేసుకున్న ఫ్లోరీనా అనే చిన్న పాప. చాలా టఫ్ కాంపిటీషన్ ఇస్తోంది." అని చెప్పారు రవిశంకర్.