English | Telugu

పుట్టింట్లో ఆఖరి వైభవ లక్ష్మి పూజ...పెళ్లి చేసుకోబోతున్న ప్రియాంక జైన్


ప్రియాంక జైన్ బుల్లితెర మీద ఒక మంచి నటి. ఇకపోతే సీరియల్స్ లో శివ్ కుమార్, ప్రియాంక జైన్ వాళ్ళది హిట్ పెయిర్ కూడా. ఇక వీళ్ళు ఎప్పటినుంచి ప్రేమలో ఉన్నారు. త్వరలో పెళ్లి కూడా చేసుకోబోతున్నారు. ఐతే రీసెంట్ గా ప్రియాంక తన పుట్టింట్లో ఆఖరి సారిగా వైభవ లక్ష్మి వ్రతం చేసుకుంది. త్వరలో పెళ్లి కాబోతున్న నేపథ్యంలో ఇదే ఆఖరి వ్రతం అని చెప్పింది. బెంగళూరులోని వాళ్ళ ఇంటికి వెళ్లి అక్కడ వైభవ లక్ష్మి అమ్మవారికి ప్రియాంక తన తల్లి కలిసి పూజ చేయడాన్ని వీడియో తీసి తన యూట్యూబ్ లో పోస్ట్ చేసింది.

వైభవ్ లక్ష్మి అమ్మవారిని లైఫ్ లో ఒక్కసారైనా పూజిస్తే ఆ ఆనందం వేరుగా ఉంటుంది అని చెప్పింది . ఇంట్లో సంతోషాలు వెల్లివిరుస్తాయి. ఇక ఈ పూజకు కొంత మంది చిన్నపిల్లలు వైభవ లక్ష్ములుగా ప్రియాంక వాళ్ళ ఇంటికి వచ్చేసారు. ప్రియాంక వాళ్ళ అమ్మ ఇద్దరూ కలిసి వైభవ లక్ష్మి కథ చదివారు. ఇక చిన్నపిల్లలందరికీ వాళ్ళు చిన్న చిన్న గిఫ్ట్ పాక్స్ ఇచ్చి వాళ్ళ ఆశీర్వాదం తీసుకున్నారు. చిన్నపిల్లల ఆశీర్వాదం బాగా పని చేస్తుంది అని పెద్దవాళ్ళు ఊరికే అనలేదు. పిల్లలంతా హ్యాపీగా ఉంటే పెద్దవాళ్ళు కూడా ఎంతో సంతోషంగా ఉన్నట్టే.. ఆ ఇంట్లో సంతోషాలు వెల్లివిరుస్తాయని అంటారు. అలాగే వచ్చిన పిల్లలందరికీ సమోసా..ఖీర్ చేసి పెట్టారు. ఇక ఫైనల్ గా అందరూ కలిసి ఫొటోస్ వీడియోస్ దిగారు.. ఐతే వీడియో ఎండింగ్ లో మాత్రం "బిగ్ అనౌన్స్మెంట్ సూన్ " అనే ఒక ఇంటరెస్టింగ్ లైన్ కి పోస్ట్ చేసింది. అంటే ప్రియాంక త్వరలో పెళ్లి చేసుకుంటుందా అనే విషయం దీన్ని బట్టి గెస్ చేస్తున్నారు నెటిజన్స్. ప్రియాంక రీసెంట్ గా బిగ్ బాస్ సీజన్ 7 కి టఫ్ కంటెస్టెంట్ ఇంట్లో అన్ని గేమ్స్ ఆడి అందరిలో ఒక ఇమేజ్ ని క్రియేట్ చేసుకుంది.

Jayam serial : బాక్సింగ్ పోటీలో మిస్సెస్ గంగ రుద్ర ప్రతాప్.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -160 లో..... గంగని ఎలాగైనా అకాడమీ సెలక్షన్ కి వెళ్లకుండా ఆపాలని ఇషిక, వీరు ట్రై చేస్తారు కానీ గంగ, రుద్ర ఇద్దరు కలిసి ఇంట్లో అన్ని పనులు పూర్తి చేసి అకాడమీకి వెళ్తారు. రుద్ర అకాడమీ బయటే ఉంటాడు. నాకు సంబంధించిన కేసు ఇంకా పెండింగ్ లో ఉంది అలా ఉండగా.. నేను లోపలకు రాకూడదని రుద్ర బయటే ఉండి గంగకి అంతా వివరిస్తాడు. నేను నీ పేరు మైక్ లో రావడం వినాలని రుద్ర అంటాడు. గంగ లోపలకు వెళ్తుంది. అక్కడ పారు ఇంకా తన ఫ్రెండ్స్ కలిసి గంగని చులకనగా మాట్లాడుతారు.