Read more!

English | Telugu

తాగిన మత్తులో మురారి చెప్పిన లవ్ ప్రపోజల్ ని కృష్ణ తెలుసుకోగలదా!

 

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -202 లో.. మురారి అతని ఫ్రెండ్ గోపి ఇద్దరు కలిసి డ్రింక్ చేస్తుంటారు. ఈ ప్రేమతోనే హ్యాపీగా ఉంటాం ప్రేమతోనే బాధపడుతామని గోపితో మురారి చెప్తాడు. ఆదర్శ్ భార్య అని ముకుందకి గౌరవం ఇస్తుంటే తనేమో అలా చేస్తుందని మురారి అంటాడు.

ఆ తర్వాత నా భార్య అని చెప్పకూడదు కానీ కృష్ణ ఎంత అందగా ఉంటుందిరా.. అలిగినప్పుడు చూడాలిరా మూతి తిప్పుతుంటే అలానే చూడాలనిపిస్తుంది బంగారు బొమ్మరా. కృష్ణకి పెద్దవాళ్ళంటే గౌరవం ఉంది. పాపం కృష్ణ చిన్నప్పటి నుండి చాలా కష్టపడిందని కృష్ణ గురించి గోపికి చెప్తాడు మురారి. ఇప్పుడు నాకు కృష్ణతో మాట్లాడాలని ఉందని కృష్ణకి ఫోన్ చేస్తాడు మురారి. కృష్ణ నీకో విషయం చెప్పాలని మురారి అంటాడు.. ఏసీపీ సర్ ఫుల్ గా డ్రింక్ చేసినట్లు ఉన్నారని కృష్ణ అనుకుంటుంది. నేను గోపి వాళ్ళింట్లో ఉన్నాను. నువ్వు తొందరగా ఇక్కడికి రా నీకో విషయం చెప్తా అని మురారి అంటాడు. సరే అని కృష్ణ అంటుంది.

నేను ఇప్పుడు వెళ్లకుంటే ఏసీపీ సర్ అలాగే తాగుతూ ఉంటాడని కృష్ణ బయలుదేరుతుంది. కృష్ణ మురారి తో మాట్లాడడం విన్న ముకుంద.. ఎలాగైనా  కృష్ణ కంటే ముందే నేను మురారి దగ్గరికి వెళ్ళాలని తను కూడా బయలుదేరుతుంది. ఆ తర్వాత మురారి దగ్గరికి కృష్ణ కంటే ముందుగానే ముకుంద వెళ్తుంది. నువ్వు ఎందుకు వచ్చావ్? ఇక్కడ నుండి వెళ్ళిపో.. కృష్ణ వస్తుందని మురారి అంటాడు. కృష్ణ రావడం గమనించిన గోపి.. వెళ్లి కృష్ణ పైకి రాకుండా ఆపుతాడు. నువ్వు కృష్ణ మాయలో పడిపోయావ్ మురారి అని ముకుంద అంటుంది. లేదు నేను కృష్ణ ప్రేమలో పడిపోయానని అంటాడు. ఐ లవ్ యు కృష్ణ అంటూ మురారి అరుస్తాడు. కృష్ణ పైకి వచ్చేలోపు ముకుంద అక్కడ నుండి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత మురారిని కృష్ణ తీసుకొని ఇంటికి వెళ్తుంది.

ఆ తర్వాత ఉదయం కృష్ణ ముందుగానే నిద్ర లేచి మురారి ని లేపుతుంది. రాత్రంతా విన్యాసాలు చేసి ఇప్పుడేంటి అలా ఉన్నారని కృష్ణ అడుగుతుంది. రాత్రి అక్కడికి ముకుంద వచ్చింది కృష్ణ చూడలేదనుకుంటా అని మురారి అనుకుంటాడు. వెళ్లి ఫ్రెషప్ అయి రండి అని కృష్ణ అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.