English | Telugu
కొత్త కెప్టెన్ గా యావర్.. ఆటగాళ్ళ గెలుపు!
Updated : Oct 14, 2023
బిగ్ బాస్ హౌజ్ లో రోజుకో ట్విస్ట్ తో దూసుకెళ్తుంది. ఉల్టా పల్టా థీమ్ తో ఈ సీజన్ అన్ని సీజన్ల కంటే ఎక్కువ టీఆర్పీని సొంతం చేసుకుంటుంది. కారణం హౌజ్ లోకి కొత్తగా 2.0 గా వచ్చిన కంటెస్టెంట్సే కారణం.
అంబటి అర్జున్, నయని పావని, పూజా మూర్తి, అశ్విని శ్రీ, భోలే శావలి ఈ అయిదుగురు కంటెస్టెంట్స్ హౌజ్ లోకి అడుగుపెట్టగా వీరికి పోటుగాళ్ళుగా, పాత కంటెస్టెంట్స్ కి ఆటగాళ్ళుగా విభజించాడు బిగ్ బాస్. అయితే గతవారం సీక్రెట్ రూమ్ కి పంపిన గౌతమ్ కృష్ణని 2.0 లో కలిపేశాడు బిగ్ బాస్. ఇక ఈ వారమంతా ఆటగాళ్ళు వర్సెస్ పోటుగాళ్ళ మధ్య పోటీ హోరాహోరీగా సాగింది. ఇక కొచెన్ లో ఉండే ప్రియాంక జైన్ కి కష్టంగా ఉందని ఏడ్చేసింది.
టాస్క్ లు ఆడాక ఓపిక లేదని, మళ్ళీ వచ్చి పదిహేను మందికి అన్నం , కూర వండటం కష్టమని ప్రియాంక జైన్ అందరికి చెప్పుకుంటూ ఏడ్చేసింది. స్ట్రాంగ్, ఫిట్, ఫాస్ట్, బెస్ట్ అంటూ సాగుతున్న టాస్క్ లలో నిన్నటివరకు ఆటగాళ్ళు, పోటుగాళ్ళు మధ్య సమానంగా ఉన్నారు. చివరిదైన ఎవరు బెస్ట్ అనే టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్. ఇందులో ఆటగాళ్ళు గెలిచారు. కాసేపటికి ఆటగాళ్ళ టీమ్ నుండి ఒకరు ఈ వారం కెప్టెన్ అవుతారని బిగ్ బాస్ ప్రకటించాడు.
ఆటగాళ్ళందరికి తలో బెలూన్ ఇచ్చి, వీరిలో ఎవరికి పోటుగాళ్ళు సపోర్ట్ చేస్తున్నారో వారికి పిన్ ఇవ్వమని బిగ్ బాస్ చెప్పగా.. ఒక్కో బజర్ కి ఒక్కొక్కరుగా వచ్చి పిన్ ని ఇచ్చారు. ఇలా రౌండ్ ముగిసే సమయానికి చివరి ముగ్గురిలో అమర్ దీప్, టేస్టీ తేజ, యావర్ ఉన్నారు. ఇక అంబటి అర్జున్ వంతు రావడంతో.. అతను పిన్ తీసుకెళ్ళి టేస్టీ తేజకి ఇచ్చాడు.
యావర్, అమర్ దీప్ లలో అమర్ కెప్టెన్సీకి అనర్హుడని, యావర్ అర్హుడని ఇచ్చాడు టేస్టీ తేజ. ఇక ఫైనల్ గా టేస్టీ తేజ, యావర్ ఇద్దరు ఉండగా.. నయని పావనికి అవకాశం వచ్చింది. తను ప్రిన్స్ యావర్ ని గెలిపించింది. దీంతో ఈ వారం హౌజ్ కెప్టెన్ గా ప్రిన్స్ యావర్ ఎన్నికయ్యాడు. పల్లవి ప్రశాంత్ దగ్గరి కెప్టెన్ బ్యాడ్జ్ ని యావర్ కి ఇవ్వమన్నాడు బిగ్ బాస్. ఇలా ఈ వారం యావర్ రెండవ హౌజ్ కెప్టెన్ గా గెలిచాడు.