English | Telugu

థ్యాంక్యూ..షో చూసి ఎంజాయ్ చేయండి

క్యాష్ షో అంటే మూవీ ప్రొమోషన్స్ కి ఒక చక్కని వేదికగా కనిపిస్తుంది. ఇక ఈ షోకి సంబంధించిన లేటెస్ట్ ప్రోమో ఇటీవల రిలీజ్ అయ్యింది. ఇక ఈ షోకి అనుదీప్, శివ కార్తికేయన్, మరియా, రాహుల్ ఎంట్రీ ఇచ్చారు. అనుదీప్ డైరెక్టర్ గా తమిళ స్టార్ హీరో శివ కార్తికేయన్ తో ‘ప్రిన్స్’ మూవీ తెరకెక్కించిన సంగతి తెలిసిందే. దీపావళి సందర్భంగా అక్టోబర్ 21న రిలీజ్ అవుతోంది. ఇక ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా ఈ టీమ్ మొత్తం క్యాష్ షోకి వచ్చారు. "ఇతన్ని అందరూ లేట్ గా గుర్తించిన ఒక జాతిరత్నం రేయ్ పట్టుకురండిరా" అని సుమ అనేసరికి "బ్యాండ్ మేళంతో, పూలు జల్లుకుంటూ అనుదీప్ ని ఎత్తుకుని ఫాన్స్ స్టేజి మీదకు తీసుకొచ్చారు".

"అనుదీప్ గారు మన సభను ఉద్దేశించి ఏదో చెప్పాలని అనుకుంటున్నారు" అని సుమ అనుదీప్ ని అడిగేసరికి "థ్యాంక్యూ..షో చూసి ఎంజాయ్ చేయండి" అన్నారు. ఏదో వీర లెవెల్ లో స్పీచ్ ఇస్తారు అనుకునేసరికి ఒక్క ముక్క మాత్రమే చెప్పడంతో సుమ ఆశ నిరాశ అయ్యింది. ఇక అనుదీప్ డైరెక్టర్ అనేదాన్ని కన్నా కమెడియన్ అనే వర్డ్ సూట్ అవుతుంది. ఇంతకుముందు ఇతను జాతిరత్నాలు అనే మూవీ డైరెక్ట్ చేసి హిట్ కొట్టాడు. అనుదీప్ క్యాష్ షోలో ఉంటె ఫన్ నెక్స్ట్ లెవెల్ అని పొట్ట పట్టుకుని నవ్వాల్సిందే అని అందరూ అనుకుంటారు.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.