English | Telugu
'మాకు తెలిసిన ప్రభుదేవా, లారెన్స్ వాళ్లిద్దరే'
Updated : Dec 23, 2022
"లేడీస్ అండ్ జెంటిల్ మాన్" షోకి ఈ ఆదివారం "లక్కీ లక్ష్మణ్" టీమ్ వచ్చి ఫుల్ ఎంటర్టైన్ చేయబోతోంది. దానికి సంబంధించిన ప్రోమో రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. ఈ షో స్టేజి మీదకు మోక్ష, సమీర్, రాజారవీంద్ర, షాని, సోహైల్, మూవీ డైరెక్టర్ అభి అందరూ వచ్చారు. స్టేజి మీదకు అందరూ డాన్స్ చేస్తూ వస్తే డైరెక్టర్ మాత్రం వాళ్ళ హీరో, హీరోయిన్ ని చూసుకుంటూ ఉంటాడు. అదే విషయాన్ని హోస్ట్ ప్రదీప్ చెప్పేసరికి "వాళ్ళు ఓకే అండి..వీళ్ళను చూడండి" అన్ని సమీర్ ని, రాజారవీంద్రని సోహైల్ చూపించేసరికి "మాకు తెలిసిన ప్రభుదేవా, లారెన్స్ వాళ్ళే" అని సెటైర్ వేసాడు ప్రదీప్.
ఇక తర్వాత వాళ్ళతో కొన్ని గేమ్స్ ఆడించాడు హోస్ట్. "కాలేజెస్ వాటిల్లో వన్ సైడ్ లవ్ స్టోరీస్ ఏమన్నా ఉన్నాయా" అని ప్రదీప్ సమీర్, రాజారవీంద్రని అడిగాడు. "వాళ్లేమో నువ్వు చెప్పు ప్రదీప్" అనడంతో "మాదంతా ఓఆర్ఆర్" అని కామెడీ చేసాడు. ఇక ఫైనల్ గా సోహైల్, మోక్ష ఇద్దరూ కలిసి "వెన్నెలవే వెన్నెలవే" సాంగ్ కి రొమాంటిక్ డాన్స్ చేశారు.