English | Telugu

షకలక శంకర్ రీ-ఎంట్రీ..టీంలీడర్ గా ఎంట్రీ ఇచ్చిన పటాస్ ప్రవీణ్

ఎక్స్ట్రా జబర్దస్త్ ప్రతీ వారం ఎంటర్టైన్ చేస్తోంది. కానీ ఈ వారం ఎంటర్టైన్మెంట్ వేరే లెవెల్ లో ఉందంటూ పెద్ద డైలాగ్ చెప్పింది రష్మీ. ఆ మాట నిజమే అనిపిస్తోంది ఈ వారం ప్రోమో చూస్తే. ప్రతీ వారం ఈ షోకి జడ్జిగా ఉన్న ఖుష్బూ ఈ వారం కనిపించలేదు. ఆమె ప్లేస్ లో సదా స్టైల్ గా వచ్చి కూర్చుంది. ఇకపోతే ఇందులో టీం లీడర్స్ కూడా మారినట్టు కనిపిస్తోంది. పటాస్ ప్రవీణ్ వస్తూనే "ఇన్నాళ్లు డైలాగులా కోసం, ప్రోమోల కోసం ఏడ్చామ్...మారాయ్..టీములు మారాయి...టీమ్ లీడర్ లు మారారు... టీం లీడర్ ప్రవీణ్ వచ్చాడని చెప్పండి" అంటూ తాను టీం లీడర్ ఐనట్టు ఆడియన్స్ కి మెసేజ్ ఇచ్చేసాడు. రీసెంట్ గానే ఇమ్మానుయేల్ కూడా టీం లీడర్ అయ్యాడు.

ఇక ఈ రాబోయే షోలో ఓల్డ్ కమెడియన్ షకలక శంకర్ కనిపించాడు. బులెట్ భాస్కర్ టీంలో కనిపించాడు. ఈ షోలో బులెట్ భాస్కర్, ఆటో రాంప్రసాద్ లేడీ గెటప్స్ లో ఎంట్రీ ఇచ్చి ఆడియన్స్ ని అవాక్కయ్యేలా చేశారు. రాకింగ్ రాకేష్ స్కిట్ లో కొత్త కొత్త చిన్నారులు కనిపించారు. ఐతే ఇందులో కెవ్వు కార్తిక్ టీం మాత్రం కనిపించలేదు. దీన్ని బట్టి కొన్ని టీమ్స్ ని పక్కన పెట్టినట్టు కనిపిస్తోంది. ఈ ప్రోమోని చూసిన నెటిజన్స్ మాత్రం "ఖుష్బూ మేడం ఎక్కడా...శకలక శంకర్ బ్యాక్ కి వచ్చాడు." అని కామెంట్స్ పెడుతున్నారు. దీన్ని బట్టి చూస్తే మేకర్స్ ఓల్డ్ జబర్దస్త్ టీమ్ మెంబర్స్ ని నెమ్మదిగా వెనక్కి పిలిపించి షోని మరింత జోష్ గా మార్చుతారేమో అనిపిస్తోంది. ఎందుకంటే ఈ షో రేటింగ్ ఇప్పటికే చాలా వరకు పడిపోయింది. అదే ఓల్డ్ కమెడియన్స్ ని బ్యాక్ కి పిలిపిస్తే షో మళ్ళీ ఊపందుకునే అవకాశం ఉందని భావిస్తున్నట్టుగా కనిపిస్తోంది..

Brahmamudi Serial : దుగ్గిరాల కుటుంబం హ్యాపీ.. రుద్రాణి కన్నింగ్ ప్లాన్ అదేనా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ బ్రహ్మముడి (Brahmamudi). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-931 లో.. మినిస్టర్ కి పాప పుడుతుంది. ఆపరేషన్ తర్వత డాక్టర్ బయటకు వస్తాడు. మీకు పాప పుట్టింది అని డాక్టర్ అనగానే.. మినిస్టర్ ఫుల్ హ్యాపీగా ఉంటాడు. కానీ పాపకి ఒక ప్రాబ్లమ్ ఉందని డాక్టర్ చెప్తాడు. ఏ ప్రాబ్లమ్ ఉన్నా ఆపరేషన్ చేయించండి.. ఎంతమంది డాక్టర్ లు ఐనా , ఎక్కడి నుంచి అయినా తీసుకొచ్చి అయినా ఆపరేషన్ చేపించండి అని మినిస్టర్ అనగానే.. ఇప్పుడు చేయకూడదు.. పాప వెయిట్ తక్కువ ఉంది.. పాప పెరిగాక ఆపరేషన్ చేయాలని డాక్టర్ చెప్తాడు. వాళ్ళిద్దరూ మాట్లాడుకునేదంతా రుద్రాణి చూస్తుంది.

Illu illalu pillalu Serial:  అమూల్య ఎంగేజ్ మెంట్ ఆపడానికి భద్రవతి ప్లాన్.. భాగ్యం ఏం చేయనుంది!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు (Illu illalu pillalu). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-370 లో.. దేవుడా ఏ ఆటంకం లేకుండా ఈ నిశ్చితార్థం సవ్యంగా జరిగేలా చూడు అని దేవుడికి మొక్కుకుంటుంది వేదవతి. అప్పుడే దేవుడి దగ్గరున్న దీపాలు ఆరిపోతాయి. అయ్యో ఇదేంటి దీపాలు ఆరిపోయాయేంటని వేదవతి టెన్షన్ పడుతుంది. మరోవైపు కామాక్షి భర్త కోసం గుమ్మం దగ్గర ఎదురుచూస్తుంటుంది. అప్పుడే తిరుపతి చూస్తాడు. ఏంటమ్మా అని అడుగుతాడు. మా ఆయన కోసం ఎదురుచూస్తున్నానని కామాక్షి చెప్తుంది. అప్పుడే కామాక్షి భర్త ఆటోలో ఎంట్రీ ఇస్తాడు.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.