English | Telugu

లక్షల విలువైన గోల్డ్ చైన్...అమ్మకు పల్లవి ప్రశాంత్ తొలి కానుక!


బిగ్ బాస్ విన్నర్ పల్లవి ప్రశాంత్ చేతికి లక్షల విలువైన బంగారు నగ వచ్చింది. అదేంటి అనుకుంటున్నారా...బిగ్ బాస్ సీజన్ 7 విన్నర్ కామన్ మ్యాన్, రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ అని మనందరికీ తెలుసు. ఐతే బిగ్ బాస్ విన్నర్స్ కి ప్రకటించే సమయంలో కొన్ని కంపెనీలు కూడా ఖరీదైన వస్తువులను, దుస్తులను, నగలను ఇలా తమ బ్రాండ్ ప్రమోషన్ కోసం స్పాన్సర్ చేస్తామని ప్రకటిస్తూ ఉంటాయి. ఇప్పుడు ఒక నగల కంపెనీ స్పాన్సర్ చేస్తామంటూ ముందుకొచ్చింది. ఫైనల్లీ ప్రశాంత్ కి ఇచ్చిన మాటను నిలబెట్టుకుంది.

దాంతో పల్లవి ప్రశాంత్ ఫుల్ జోష్ తో ఉన్నాడు. ఎందుకంటే తాను విన్నర్ అయినప్పుడు ఆ నగల కంపెనీ ప్రకటించిన కాస్ట్లీ గోల్డ్ చైన్ అతని చేతికి వచ్చింది. బిగ్ బాస్ సీజన్ ఫైనల్ లో విన్నర్‌గా నిలిచిన వారికి నగదు పాటు, రూ. 15 లక్షల విలువైన బంగారం కూడా ఇస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇక ఆ గోల్డ్ చైన్ అందుకుని "అమ్మకి తొలి కానుక.. థ్యాంక్యూ బిగ్ బాస్ సీజన్ 7 ..లవ్ యు నాగ్ సర్ " అంటూ పల్లవి ప్రశాంత్ తన ఇన్స్టాగ్రామ్ లో ఒక పోస్ట్ పెట్టాడు. ఐతే పల్లవి ప్రశాంత్ తనకు విన్నింగ్ అమౌంట్ వస్తే అందరికీ హెల్ప్ చేస్తాను అని కూడా మాటిచ్చాడు. అలా తాను ఇచ్చిన మాట కూడా నిలబెట్టుకున్నాడు. శివాజీ చేతుల మీదుగా ఓ రైతు కుటుంబానికి రూ. లక్ష ఇప్పించాడు ప్రశాంత్. ఒక సంవత్సరానికి సరిపడా బియ్యం కూడా అందజేశాడు. ఇక నెటిజన్స్ అంతా కూడా బిగ్ బాస్ విన్నర్ పల్లవి ప్రశాంత్ కి కంగ్రాట్యులేషన్స్ చెప్తున్నారు.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.