English | Telugu

ఒక‌వైపు ఆర్థిక స‌మ‌స్య‌లు.. ఇంకోవైపు బ్యాన్‌.. బుల్లితెర నటి క‌ష్టాలు!

'పసుపు కుంకుమ' సీరియల్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన కన్నడ భామ పల్లవి గౌడ. ఈ సీరియల్‌లో అంజలి అనే పాత్రలో నటించిన ఈ బ్యూటీ ఆ తరువాత 'సావిత్రి' అనే సీరియల్ చేసింది. అయితే కొద్దిరోజులకే ఆమె సీరియల్ నుండి తప్పుకుంది. దీనికి కారణం ఏంటనే విషయం బయటకు చెప్పలేదు. నిజానికి తాను యానిమేషన్ రంగంలోకి వెళ్లాల‌నుకున్నాన‌నీ కానీ అనుకోకుండా టీవీ రంగంలోకి వచ్చాన‌నీ చెప్పింది. త్వరలోనే మళ్లీ తెలుగు సీరియల్స్ చేస్తానని వెల్లడించింది.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె కొన్ని ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చింది. ప్రొడ్యూసర్ కౌన్సిల్ లో తనపై బ్యాన్ విధించిన విషయాన్ని ప్రస్తావించింది. 'సావిత్రి' సీరియల్ చేసే చేసే సమయంలో వేరే ఏ తెలుగు సీరియల్ లో నటించనని అగ్రిమెంట్ చేసుకున్నట్లు వెల్లడించింది. అయితే ఆ సీరియల్ లో నటించినందుకు తనకు పేమెంట్స్ సరిగ్గా ఇవ్వలేదని.. రెండు నెలల పాటు అలానే చేశారని తెలిపింది. అదే సమయంలో తనకు వేరే సీరియల్ లో నటించే అవకాశం వస్తే.. ఒప్పుకుంటానని 'సావిత్రి' నిర్మాతలతో చెబితే వాళ్లు ఒప్పుకోలేదని స్పష్టం చేసింది.

కనీసం పెండింగ్ పేమెంట్ అయినా ఇవ్వమని అడిగానని.. అది కూడా సెటిల్ చేయలేదని చెప్పుకొచ్చింది. ఆర్థిక‌ సమస్యల వలన వేరే సీరియల్ చేస్తానని చెప్పడంతో ప్రొడ్యూసర్స్‌ కౌన్సిల్ లో తనను బ్యాన్ చేశారని చెప్పుకొచ్చింది. మరోపక్క తన వ్యక్తిగత జీవితంలో కూడా పల్లవి చాలా సమ‌స్య‌లు ఎదుర్కొంటోంది. మనస్పర్థల కారణంగా భర్తతో విడిపోయింది. రీసెంట్ గా విడాకులు కూడా తీసుకున్నారు. ప్రస్తుతం తన జీవితంలో జరిగిన చేదు సంఘటనల నుండి బయటపడడానికి ప్రయత్నిస్తున్నట్లు చెప్పింది ప‌ల్ల‌వి.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.