English | Telugu

సర్కార్ సీజన్ 3 లో "న్యూసెన్స్" చేసిన టీం..

సర్కార్ సీజన్ 3 లేటెస్ట్ ఎపిసోడ్ ప్రోమో రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. ఇక ఈ షోకి "న్యూసెన్స్" మూవీ టీం ప్రొమోషన్స్ లో భాగంగా నవదీప్, బిందుమాధవి వచ్చారు. వాళ్ళతో పాటు టీవీ 9 న్యూస్ రీడర్స్ ప్రత్యూష, సత్య కూడా వచ్చారు. ఈమధ్య టీవీ చానెల్స్ నుంచి న్యూస్ రీడర్స్ కూడా షోస్ కి, ఈవెంట్స్ కి వచ్చే సంస్కృతి నెమ్మదిగా మొదలయ్యింది. వాళ్ళు కూడా ఆడియన్స్ కి బాగా తెలిసిన ముఖాలు కావడం వాళ్లకు ఒక సెలబ్రిటీ స్టేటస్ ఉండడంతో షో మేకర్స్ కూడా వాళ్ళను బాగా హైలైట్ చేస్తున్నారు.

ఇక ఈ షోలోకి నవదీప్ ఎంట్రీ ఇస్తూనే "సర్కార్ సోలో ఓటిటికి పవన్ కళ్యాణ్ నేను అని ఫీలవుతూ పవన్ కళ్యాణ్ గారి సాంగ్స్ పెట్టుకున్న ప్రదీప్" అని నవదీప్ అనడంతో అతని భుజం మీద చెయ్యేసాడు. వెంటనే "మీడియా మీద చెయ్యేసి ప్రదీప్" అని అన్నాడు. "నోనో మీరు అలాంటివి అనకండి" అని నోరు మూసేసరికి "మీడియా నోరు నొక్కేస్తున్న ప్రదీప్" అంటూ ఫుల్ రేంజ్ లో డైలాగ్ చెప్పారు నవదీప్, బిందు.

తర్వాత సత్య, ప్రత్యూష స్టేజి మీదకు వచ్చారు. "డిం లైట్స్, జనాలు, నవదీప్ అంటే మనం ఇక్కడి నుంచి స్పాట్ రిపోర్టింగ్ చేయాల్సిన అవసరం ఉంటుందేమో అని డౌట్ గా ఉంది సత్య" అంది ప్రత్యూష. ఈ నలుగురు వాళ్ళ వాళ్ళ సీట్స్ లో కూర్చున్నాక "ఆరు తర్వాత రెండురా మా ప్రదీపన్న తీస్తాడు బెండురా" అంటూ కామెడీ చేసాడు నవదీప్. బింధుమాధవిని ఒక ప్రశ్న వేసాడు ప్రదీప్ "రామాయణాన్ని ఏ పేర్లతో విభజించారు అవి ఏమిటి" అనేసరికి బిందుమాధవి కళ్ళు ఎర్రగా ఐపోయాయి. "తన కళ్ళల్లో చంద్రముఖి కనిపిస్తోంది" అంది ప్రత్యూష...ఇలా ఈ రాబోయే వారం సర్కార్ ఎపిసోడ్ పంచ్ డైలాగ్స్ తో న్యూసెన్స్ క్రియేట్ చేయబోతోంది. లాస్ట్ ఎపిసోడ్ లో అల్లరి నరేష్ విజేతగా నిలవగా ఈ నెక్స్ట్ వీక్ ఎపిసోడ్ లో ఎవరు విన్ అవుతారో చూడాలి.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.