English | Telugu

కార్ కొనిస్తే పెళ్లి చేసుకుంటా..నిఖిల్ విజయేంద్ర సింహ వెరైటీ ప్రొపోజల్

నితిన్, నిత్యామీనన్ నటించిన ఇష్క్ మూవీ చూసే వుంటారు మీరంతా..అందులో స్టార్టింగ్ లో ఆటోలో వెళ్తున్న నిత్యా మీనన్ ఒక చోట రెడ్ సిగ్నల్ పడినప్పుడు ఆ పక్కన జ్యువెలరీ బ్యాంగిల్స్ ఉన్న ఒక హోర్డింగ్ చూస్తుంది. వెంటనే వాళ్ళ అమ్మకు ఫోన్ చేసి ఈ బ్యాంగిల్స్ ని ఎవరు కొనిస్తారో వాళ్లనే పెళ్లి చేసుకుంటా అని చెప్తుంది. ఈ సీన్ చాలా మందికి గుర్తు ఉండే ఉంటుంది కదా .

ఇక ఇప్పుడు అలాంటి సీన్ ఒకటి రిపీట్ అయ్యింది.యూట్యూబర్ నిఖిల్ విజయేంద్ర సింహ గురించి అందరికీ తెలుసు. సెలెబ్స్ ని తీసుకొచ్చి "నిఖిల్ తో నాటకాలు" అనే షో చేస్తూ ఉంటాడు. అలాగే అప్పుడప్పుడు మూవీ ప్రొమోషన్స్ లో కనిపిస్తూ ఉంటాడు..బుల్లితెర ఈవెంట్స్ కి వచ్చి ఎంటర్టైన్ చేస్తూ ఉంటాడు. ఇప్పుడు నిఖిల్ తన ఇన్స్టాగ్రామ్ స్టేటస్ లో ఒక పోస్ట్ పెట్టాడు. అది మంచి మంచి కాస్ట్లీ కార్ ఫోటో అన్నమాట. " ఎవరైతే ఈ కార్ ని నాకోసం కొనిపెడతారో నేను వాళ్లనే పెళ్లి చేసుకుంటా"...అని ఇంగ్లీష్ లో చెప్పాడు. గీతంలో బి.కామ్ ఆనర్స్ చేసిన నిఖిల్ ని వాళ్ళ అమ్మకు ఎంటర్టైన్మెంట్ రంగం అంటే చిన్నప్పటి నుంచి ఇష్టం. అందుకే తనకు చిన్నప్పటి నుంచి సంగీతం, డాన్స్ అన్నీ నేర్పించింది. అలా నిఖిల్ స్కూల్లో, కాలేజీలో ఎక్స్ట్రా కరిక్యూలర్ యాక్టివిటీస్ లో ఎక్కువగా పార్టిసిపేట్ చేసేవాడట. గీతంకి వచ్చాక అన్ని ప్రోగ్రామ్స్ కి యాంకర్ గా చేసేవాడు నిఖిల్.

మరి ఇప్పుడు ఈ కార్ ని ఏ అమ్మాయి కొనిపెడుతుందో..మరి నిఖిల్ ఎవరిని పెళ్లి చేసుకుంటాడో చూడాలి.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.