English | Telugu

గుప్పెడంత మనసులో సరికొత్త ట్విస్ట్.. శైలేంద్ర ప్రపోజల్ ని రిజెక్ట్ చేసిన రిషి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -767 లో.. వసుధార ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తుంటుంది. అప్పుడే రిషి వచ్చి.. దేని గురించి ఆలోచిస్తున్నావు.. నీ మూడ్ బాలేదని నాకు తెలుసు అని రిషి అంటాడు. మీ మేడం నిన్ను అలా అనేసరికి నాకు బాగా అనిపించలేదు.. అందుకే అలా అన్నానని రిషి అంటాడు. మేడం మన గురించి, మన క్షేమం గురించి అలా అంటుందని వసుధార అంటుంది. అయిన మనకు ఏం అవుద్ది కొంచెం ఎక్కువగా ఆలోచించడం మానెయమని చెప్పు మీ మేడంకి వసుధార అని రిషి చెప్తాడు. మరి మేడం ఏమైనా బాధపడిందా అని రిషి అడుగగా.. సర్ నేను అదే అడిగాను. నాపై రిషి కోప్పడ్డ సరే రిషి బాగుండాలని మేడం అంది. మీరంటే మేడంకి ప్రాణమని వసుధార అనగానే.. రిషి డల్ అయిపోయి గుడ్ నైట్ చెప్పి వెళ్ళిపోతుంటాడు. ఏంటి నువ్వు గుడ్ నైట్ చెప్పవా అని రిషి అడుగుతాడు. మీరు అప్సెట్ లో ఉన్నారా మిమ్మల్ని అలా వదిలేస్తే రిషిధారని ఎలా అవుతాను.. మిమ్మల్ని హ్యాపీ చేసి హ్యాపీ నైట్ చెప్తానని వసుధార అంటుంది.

వసుధార అలా అనగానే.. ఏం చేస్తావ్ మరి అని రిషి అడుగుతాడు. ఒక క్విజ్ పెట్టుకుందామా అని అనుకుంటారు‌. అలా తమ మొదటి పరిచయం దగ్గరనుండి కొన్ని ప్రశ్నలు అడుగుతు సరదాగా మాట్లాడుకుంటూ అలాగే చైర్ పై నిద్ర పోతారు. ఉదయం ధరణి కాఫీ తీసుకొని వచ్చేసరికి.. ఇద్దరు బయట చైర్ పై నిద్రపోయి ఉండడం చుసి నవ్వుకోని.. వాళ్ళిద్దరిని లేపి కాఫీ ఇస్తుంది. ఆ తర్వాత వసుధార రెడీ అవుతుంటే.. రిషి తన గదిలోకి వెళ్తాడు. ఏమైనా హెల్ప్ చెయ్యేలా అని అడుగుతాడు. మీరు చెయ్యాడమేంటీ సర్.. మీరు నా ఎండీ అని వసుధార అంటుంది. మనకు ఎంగేజ్ మెంట్ అయిందని రిషి అనగానే.. ఎంగేజ్ మెంట్ మాత్రమే అయింది పెళ్లి కాలేదని వసుధార అంటుంది. ఎందుకు అలా అంటున్నవని రిషి అంటాడు. మీరు ఎందుకు అంటున్నారో నేను అందుకే అంటున్నానని వసుధార సిగ్గు పడుతుంది. సరే రెడీ అయి కిందకి రా కాలేజీకి వెళ్ళాలని చెప్పి రిషి వెళ్ళిపోతాడు.

మరొకవైపు అందరూ హాల్లో కూర్చొని ఉంటారు. రిషి కంగ్రాట్స్ మిషన్ ఎడ్యుకేషన్ గురించి అందరూ గొప్పగా చెప్తున్నారని శైలేంద్ర అంటాడు. మిషన్ ఎడ్యుకేషన్ ఇక్కడే కాకుండా వేరే స్టేట్స్ లో కూడా విస్తరించాలి.. అందుకు మీరు అక్కడికి వెళ్ళాలని శైలేంద్ర అనగానే.. లేదు అన్నయ్య.. నేను ఎక్కడికి వెళ్ళనని రిషి అంటాడు. కాలేజీని నేను చూసుకుంటాను.. నువ్వు వసుధారా కలిసి వెళ్ళండని శైలేంద్ర అంటాడు. లేదు అన్నయ్య.. ఈ ఇంటిని, కాలేజీని, త్వరలో మెడికల్ కాలేజీ స్టార్ట్ చేస్తున్నాం.‌. ఇవ్వనింటిని వదిలి వెళ్ళలేను అని రిషి అంటాడు. నీ మాట కాదని అంటున్నందుకు సారీ అని రిషి అంటాడు. శైలేంద్రకు దూరంగా ఉండొచ్చని అనుకుని.. రిషితో వసుధర వెళదాం సర్ అని అంటుంది. రిషి తో అలా అనేసరికి.. రిషి కోపంగా.. నేను ఎక్కడికి వెళ్ళానని చెప్పి వెళ్ళిపోతాడు. రిషి వెనకాల వసుధార వెళ్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Brahmamudi Serial : దుగ్గిరాల కుటుంబం హ్యాపీ.. రుద్రాణి కన్నింగ్ ప్లాన్ అదేనా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ బ్రహ్మముడి (Brahmamudi). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-931 లో.. మినిస్టర్ కి పాప పుడుతుంది. ఆపరేషన్ తర్వత డాక్టర్ బయటకు వస్తాడు. మీకు పాప పుట్టింది అని డాక్టర్ అనగానే.. మినిస్టర్ ఫుల్ హ్యాపీగా ఉంటాడు. కానీ పాపకి ఒక ప్రాబ్లమ్ ఉందని డాక్టర్ చెప్తాడు. ఏ ప్రాబ్లమ్ ఉన్నా ఆపరేషన్ చేయించండి.. ఎంతమంది డాక్టర్ లు ఐనా , ఎక్కడి నుంచి అయినా తీసుకొచ్చి అయినా ఆపరేషన్ చేపించండి అని మినిస్టర్ అనగానే.. ఇప్పుడు చేయకూడదు.. పాప వెయిట్ తక్కువ ఉంది.. పాప పెరిగాక ఆపరేషన్ చేయాలని డాక్టర్ చెప్తాడు. వాళ్ళిద్దరూ మాట్లాడుకునేదంతా రుద్రాణి చూస్తుంది.

Illu illalu pillalu Serial:  అమూల్య ఎంగేజ్ మెంట్ ఆపడానికి భద్రవతి ప్లాన్.. భాగ్యం ఏం చేయనుంది!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు (Illu illalu pillalu). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-370 లో.. దేవుడా ఏ ఆటంకం లేకుండా ఈ నిశ్చితార్థం సవ్యంగా జరిగేలా చూడు అని దేవుడికి మొక్కుకుంటుంది వేదవతి. అప్పుడే దేవుడి దగ్గరున్న దీపాలు ఆరిపోతాయి. అయ్యో ఇదేంటి దీపాలు ఆరిపోయాయేంటని వేదవతి టెన్షన్ పడుతుంది. మరోవైపు కామాక్షి భర్త కోసం గుమ్మం దగ్గర ఎదురుచూస్తుంటుంది. అప్పుడే తిరుపతి చూస్తాడు. ఏంటమ్మా అని అడుగుతాడు. మా ఆయన కోసం ఎదురుచూస్తున్నానని కామాక్షి చెప్తుంది. అప్పుడే కామాక్షి భర్త ఆటోలో ఎంట్రీ ఇస్తాడు.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.