English | Telugu

దీపక్కా..అచ్చం సౌందర్యలా ఉన్నావ్ ...


"ఆరనీకుమా ఈ దీపం" అనే సాంగ్ వింటే స్టార్ మా సీరియల్ కార్తీక దీపం అందులోని ప్రేమి విశ్వనాధ్ అలియాస్ దీపక్క గుర్తొచ్చేస్తుంది. ఇప్పుడు కార్తీక దీపం సెకండ్ పార్ట్ కూడా నడుస్తోంది. బుల్లితెర మీద దీపక్కకి ఉన్న రేంజ్ స్టార్ హీరోకి కూడా లేదు. సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది. ఇక తన కొడుకుతో రీల్స్ చేస్తూ అలరిస్తూ ఉంటుంది. రీసెంట్ గా ఆమె గ్రీన్ టి-షర్ట్, వైట్ ప్యాంట్ బ్లాక్ క్యాప్ పెట్టుకున్న ఒక ఫోటోని తన ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసింది.

ఇక దీనికి "ఎం కాప్షన్ పెట్టాలో తెలియడం లేదు.. ఎవరైనా ఒకటి సజెస్ట్ చేస్తారా" అని అడిగింది. దానికి నెటిజన్స్ చాలా రిప్లైస్ ఇచ్చారు. "నాకు సౌందర్య గారు గుర్తున్నారు. ఈ పిక్ చూస్తే ఆమె గుర్తొచ్చారు. ఈ పిక్ లో మీ లిప్స్ బాగున్నాయి మరి సీరియల్ లో అలా ఉన్నాయేమిటి" అని కామెంట్స్ పెడుతున్నారు. ప్రేమి విశ్వనాథ్ కొన్నాళ్లు లీగల్ అడ్వైసర్‌గా పనిచేసి సీరియల్స్‌లోకి ఎంటరయ్యింది. ముందుగా మలయాళంలో వచ్చిన ‘కార్తీక దీపం’ సీరియల్ లో నటించింది. ‘కరుత ముతు’ అనే టైటిల్‌తో మలయాళంలో ప్రసారమయ్యింది. ఈ ‘కరుత ముతు’ సీరియల్‌లో బ్లాక్ మేకప్ వేసుకొని నటించడం నిజంగా గొప్ప విషయం. తెలుగులో కార్తీక దీపం ఎంత సూపర్ డూపర్ హిట్టో అందరికీ తెలుసు.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.